Dreams about Breaking Teeth: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా - అది దేనికి సంకేతమో తెలుసా!
ఎప్పుడైనా మీకు పళ్లూడిపోయినట్టు, మీ దంతాలు విరిగిపోయినట్టు, రాలి పడిపోయినట్టు కలవచ్చిందా? ఈ కల దేనికి సంకేతం? పరిశోధకులు ఏం చెబుతున్నారు - స్వప్నశాస్త్రంలో ఏముంది?...
Dreams about Breaking Teeth: కలలకు అర్థం ఉండదు..అన్వయం మాత్రమే ఉంటుంది. అంటే అలా జరిగింది కాబట్టి ఈ కల వచ్చింది..లేదంటే..ఈ కల వచ్చింది కాబట్టి అలా జరగబోతోంది అని భావించడమే అన్వయం. ఇంతకీ...కలలో జరిగింది నిజం అవుతుందా? కలలను పరిగణలోకి తీసుకోవాలా? లేదంటే..
కలలను తేలిగ్గా తీసిపడేయాలా? అంటే...కలలను నూటికి నూరుశాతం పరిగణలోకి తీసుకోవడమూ కరెక్టు కాదు అలాగని కొన్ని కలల్ని తేలిగ్గా తీసి పడేయాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే కలలపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. కలలను అర్థం చేసుకునేందుకు, వాటి ఫలితాలను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో జరిగే కొన్ని సంఘటనలు రానున్న రోజుల్లో మంచి, చెడు రెండు సూచనలను ఇస్తాయి. అలాంటి వాటిలో దంతాలు విరగినట్టు, ఊడినట్టు, ఎవరైనా పీకేసినట్టు వచ్చే కల.
Also Read: తెల్లవారుజాము వచ్చే కలలు నిజమవుతాయా? దీనిపై పురాణాలు.. సైన్స్ ఏం చెబుతున్నాయి?
మీ దంతాలు ఊడిపోతున్నట్టు, పగిలినట్టు, ఎవరైనా పీకేస్తున్నట్టు ఎప్పుడైనా కల కన్నారా? అది కలే అని తెలిసినప్పటికీ ఇలాంటి కల తర్వాత కొంత కలవరపాటుకి గురవడం సహజం. ఒక్కసారి ఉలిక్కి పడి లేచేవారున్నారు. జనాభాలో 39% మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా దంతాలు రాలిపోవడం, కుళ్లిపోవడం లేదా విరగడం గురించి కలలు కన్నారని పరిశోధనలో తేలింది. 8.2% మంది తరచూ ఇలాంటి కలలు వస్తుంటాయని చెప్పినట్టు నివేదించారు. అయితే సైన్స్ కన్నా వీటి గురించి శాస్త్రాల్లోనే ఎక్కువ ప్రస్తావించారు. యూదు గ్రంధాల రచయితలు నుంచి ప్రాచీన ఈజిప్షియన్, గ్రీకు తత్వవేత్తల వరకు చాలా మంది కలలు దేవుడి నుంచి అందే కమ్యూనికేషన్ సాధనంగా విశ్వసించారు. తీరని కోరికలు కలలుగా వస్తాయి. అవి తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా అంటే ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చని సైకోఎనాలసిస్ పితామహుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ స్పష్టం చేశాడు. అయితే ఏ కలని ఆ కలగానే ఎనలైజ్ చేస్తే అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందన్నాడు. అంటే కలలన్నింటినీ ఒకే మూసలో పెట్టి చూడరాదన్నది దీని అర్థం.
Also Read: కామన్ వచ్చే 10 కలలు ఇవి, వీటిలో వచ్చిన కలను బట్టి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు!
దంతాలు ఊడినట్టు కలలు ఎందుకొస్తాయి
ఇజ్రాయెల్ పరిశోధకుల అధ్యయనం
దంతాల గురించి వచ్చే కలలు అవి మీలో ఉన్న ఆందోళనకు, ఆతృతకు సంకేతం అంటారు కొందరు పరిశోధకులు. దీనికి సంబంధించి స్పష్టమైన అధ్యయనాలు లేకపోయినప్పటికీ ఇద్దరు పరిశోధకులు ఈ అంశంపై లోతుగా పరిశోధించారు. ఇజ్రాయెల్‌లోని నెగెవ్‌లోని బెన్-గురియన్ యూనివర్శిటీకి చెందిన రోజెన్, సోఫర్-డుబెక్ . దంతాల కలలు, మానసిక ఆలోచనలను అర్థం చేసుకునేందుకు ఓ పరిశోధన నిర్వహించారు. కొంతమంది విద్యార్థులను ఎంపిక చేసుకుని కలలు, సైకలాజికల్ స్ట్రెస్, నిద్ర, పంటి సమస్యల గురించి పరిశోధనలు చేశారు. దంతాలకు సంబంధించిన చికాకులు, నిద్రలో పళ్లు కొరకటం పై ప్రధానంగా దృష్టి సారించారు. చాలా మంది నిద్రలో పళ్లు కొరకడం గురించి తెలియదన్నారు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోన్నామని చెప్పారు. ఈ కలలతో నిద్రకు కానీ మానసిక ఆరోగ్యానికి కానీ ఎలాంటి సమస్యా లేదని పరిశోధకులు గుర్తించారు. అయితే అంతకు ముందు జరిగిన అధ్యయనాల్లో ఇలాంటి కలలు వచ్చే విద్యార్థుల్లో నిరాశ, ఆందోళన, నిస్సహాయత, నియంత్రణ కోల్పోవడం లాంటివి గుర్తించారు.
మరికొందరు పరిశోధకులు ఇలా చెప్పారు
- మీకు బాగా కావాల్సినవాళ్లు రుణం తీరకుండానే చనిపోతే ఆ ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు ఇలాంటి కలలు వస్తాయన్నారు ఈజిప్టియన్ ఫిలాసఫర్స్
- లైంగిక ఆలోచనలున్నా, లైంగిక భయాలున్నా కానీ ఇలాంటి కలలు వస్తాయని సిగ్మండ్ ఫ్రాయిడ్ , కార్ల్ జంగ్ చెప్పారు
- మన కలలు మన దైనందిత జీవితంలో ఆలోచనలపైనే ఆధారపడి ఉంటాయని , త్వరలో పంటి సమస్యలు రావొచ్చనే హెచ్చరిక కూడా అయి ఉండొచ్చన్నారు మరికొందరు పరిశోధకులు
స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది
- స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో పన్ను విరగడం చూసినట్లయితే మీ జీవితంలో ఏదో ఒక విషయంలో మీరు అసౌకర్యంగా ఉన్నారని అర్థం, ఇది మీ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపబోతోంది అప్రమత్తంగా ఉండండని చెప్పడమే.
- ఒక వ్యక్తి కలలో తన దంతాలు విరగడం చూస్తే, రాబోయే కాలంలో మీరు జీవితంలో కొత్త అవకాశాలను పొందుతారు, ఆ అవకాశాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని అర్థం
- ఎవరైనా మీ దంతాలను పట్టుకున్నట్లు లేదా పగలగొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు కనిపిస్తే, అది మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద మార్పు జరగబోతోందనడానికి సంకేతం. ఈ మార్పు గురించి మీరు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక కూడా
- ఒక వ్యక్తి కలలో తన దంతాలు ఎవరో విరగ్గొడుతున్నట్టు కనిపిస్తే మీ జీవితంలో ఏదో తప్పు జరుగుతుందని అర్థం, ఈ విషయాన్ని గుర్తించి ఆ దిశగా వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి
- మీ దంతాలు పగలగొట్టడాన్ని మీరు చూస్తే..ఏదో ఒక విషయంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని అర్థం. అలాంటి పరిస్థితిలో మీరు దానిని అధిగమించడానికి ప్రయత్నించాలనే సూచన..
ఇప్పటి వరకూ ఇలాంటి కలలపై సైన్స్ స్పష్టంగా చెప్పకపోయినా వీటికి సంబంధించి కలలు రాగానే కలత చెందినవారే ఎక్కువమంది ఉన్నారు.
Also Read: ఈ 5 కలలు పొరపాటున కూడా ఇతరులతో పంచుకోకూడదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.