Most Common Dreams: కామన్ వచ్చే 10 కలలు ఇవి, వీటిలో వచ్చిన కలను బట్టి ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవచ్చు!
వ్యక్తుల ప్రవర్తనను బట్టి వారికి కలలు వస్తాయి. కొన్ని కలలు జరగబోయేదాని గురించి కొన్ని సూచనలు ఇస్తాయి. ఎవరికి ఎన్నిరకాల కలలు వచ్చినా అందరకీ కామన్ గా వచ్చే కలలేంటి.. వాటి అర్థమేంటి...
Most Common Dreams: నిద్రలో వచ్చేది కల... కలలు రానివారి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. ఆనందం అయినా బాధ అయినా , ఒత్తిడి అయినా రోజంతా చేసే పనిప్రభావం కలగా కనిపిస్తుందని కూడా చెబుతారు. ఒక్కో కల 15 నుంచి 40 నిమిషాల పాటు ఉంటుందట. అయితే వీటిలో అధిక శాతం కలలు గుర్తుండవు. కేవలం కొద్ది మందికి మాత్రమే అవి గుర్తుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన కల వస్తుంటుంది కానీ..కొన్ని కలలు కామన్ గా వస్తాయి..తరచూ వస్తూనే ఉంటాయి. అవేంటి..ఏం సూచిస్తాయి, నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం...
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
ఎవరికి ఎన్నిరకాల కలలు వచ్చినా అందరకీ కామన్ గా వచ్చే కలలేంటంటే..
- ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి లోయలో పడిపోతున్నట్టు కల వస్తే మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్టు భావించాలి. ఈ సమస్య వృత్తి, ఉద్యోగం, మీ కుటుంబానికి...దేనికైనా సంబంధించినది అయి ఉండొచ్చు
- మీకు మీరు నగ్నంగా కనిపిస్తే..కొన్ని విషయాల్లో మీకున్న తొందరపాటుని, ఆతృతను తెలియజేస్తుంది. సాధారణంగా కొత్త ప్రదేశంలోకి వెళ్లబోతున్న వారికి, కెరీర్లో ఉన్నత స్థానం సాధించినవారికి ఇలాంటి కలలు వస్తాయి
- పరీక్షలు రాస్తున్నట్టు కలలు వస్తుంటాయి. విద్యార్థులకు కామన్ గా ఈ కలలు వస్తాయి కానీ...చదువులు పూర్తై ఉద్యోగాల్లో స్థిరపడినవారికి కూడా ఇలాంటి కలలు వస్తాయి. పరీక్ష రాస్తున్నట్టు కల వస్తే వారు చదువు లేదా పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సూచన.
- ఎవరైనా సెలబ్రిటీని కలిసినట్టు కల వస్తే మీలో ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతున్నట్టు భావించాలి. మంచి పేరు, గుర్తింపు కోసం మీరు ప్రయత్నిస్తున్నారని..ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అర్థం చేసుకోవాలి.
- మీరు చనిపోతున్నట్టు కల అస్సలు రాకూడదు అంటారు. ఇలా వస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సంబంధం, ఉద్యోగం లేదా మీరు రెగ్యులర్ గా చేసే ఏదైనా పనికి శాశ్వతంగా ఫల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. అయితే చనిపోతున్నట్టు కలవస్తే ఆ వ్యక్తికి ఉన్న దోషాలు తొలగి దీర్ఘాయువు అని కూడా అంటారు.
- ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే మీరు ఎదుర్కొంటున్న ఏదో ఓ సమస్యను కొంత సేపు పక్కన పెట్టాలనుకుంటున్నారని అర్థం. మరి పక్కనపెడతారో అప్రమత్తమై ఆ పని పూర్తిచేస్తారో మీదే నిర్ణయం.
- మీ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కల వస్తే అది మీ భాగస్వామి మీ పట్ల చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియజేస్తుంది. అయితే మీ జీవిత భాగస్వామిపై పూర్తిగా నమ్మకం కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి.
- అనుకున్న సమయం కన్నా ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్లినట్టు కలొస్తే..ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి నిర్దిష్ట సమయానికల్లా ఏదైనా ముఖ్యమైన ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాలని అర్థం. రెగ్యులర్ గా ఆలస్యంగా వెళ్లేవారికి ఈ కలలు వస్తాయట
- దంతాలు ఊడిపోయినట్టుగా కల వస్తే కొందరు దీన్ని అపశకునంగా, మరికొందరు శుభంగా భావిస్తారు. ఈ కల వచ్చిన వ్యక్తుల్లో కొందరు తమకు పట్టుదల, శక్తి, ఆత్మవిశ్వాసం పెరిగాయని భావిస్తారు. మరికొందరు తమ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని అనుకుంటారు. మహిళలకు ఇళాంటికల వస్తే తమ కోర్కెలు నెరవేరాలని ఆశిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి. పురుషుల్లో అయితే లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారని అర్థం చేసుకోవాలి.
- పాములు కనపడినట్టు కల వస్తే ఆ వ్యక్తి తనను తాను మార్చుకుంటానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం. ఎందుకంటే పాములు కొన్ని రోజులకోసారి తమ చర్మాన్ని కుబుసం రూపంలో విడుస్తాయిగా. అలాగే వ్యక్తులు కూడా తమను తాము కొత్త వ్యక్తిగా మార్చుకోవాలని చూస్తున్నట్టు. పాములు కలలో కనిపించడాన్ని శుభంగానే భావిస్తారు చాలామంది.
Also Read: ఇలాంటి కల వస్తే ఆరునెలల్లో చనిపోతారట!
నోట్: కొందరు నిపుణులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం