మహా పాతకం అంటే నిష్కృతిలేనిది అని అర్థం. అంటే ఈ జన్మకు ఏం చేసినా ఈ పాపాలను కడుక్కోవడం కుదరదు. వాటి ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే.
కొన్ని పాపాలకు పరిహారం ఉంటుంది కానీ పంచమహాపాతకాలు అని చెప్పుకునే వీటికి మాత్రం ఎలాంటి నిష్కృతి ఉండదు.
1. తల్లిదండ్రులను దూషించేవాడికి నిష్కృతి లేదు. దూషించడమే తప్పు అంటే ఇక హత్య చేస్తే ఆ పాపం జన్మజన్మలకీ కడుక్కోలేరు
2. కలలో కూడా గురువుని ఏకవచనంతో పిలవడకూడదు. పిలిచారంటే తన మనసులో ఏమూలో అలా పిలవాలనే ఆలోచన వచ్చి ఉండాలి.
3. తాగే నీటికి కలుషితం చేయడం- నడిచే దారిని మూసేయడం మహాపాపం. ఈ రెండు పాపాలు చేస్తే ఆ పాపం పిల్లల భవిష్యత్, ఆరోగ్యంపై పడుతుంది. అది కూడా ఈ జన్మలోనే అనుభవించకతప్పదు.
4. గోవుని అకారణంగా కొట్టడం మహాపాపం. పని చేయించుకునేవాడు అప్పటి అవసరం కోసం కొట్టొచ్చు కానీ ఆకతాయిగా కొడితే గోవు చర్మంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని జన్మలు ఎత్తినా ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది.
5.ఆత్మహత్య మహాపాపం. పరమేశ్వర స్వరూపంలో జీవుడిని ఇచ్చింది తండ్రి, శరీరాన్ని తయారు చేసింది తల్లి. అంటే ఈ శరీరం మన సొంతం కాదు. అర్థమయ్యేలా చెప్పాలంటే అద్దె ఇంట్లో ఉంటూ యజమానికి తెలియకుండా ఆ ఇల్లు అమ్మేయడం అన్నమాట.
మొదటి నాలుగు పాపాలకు ఆ జీవుడు మాత్రమే అనుభవిస్తాడు. కానీ ఆత్మహత్య చేసుకుంటే మాత్రం అటు ఐదు తరాలు, ఇటు ఐదు తరాలు సర్వనాశనం అయిపోతాయ్. Images Credit: Pinterest