బొట్టుపెట్టుకోవడం వెనుకున్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు
హిందుత్వంలో దేహాన్ని దేవాలయంగా భావిస్తారు. శరీరంలోని ప్రతి అవయవంలోనూ భగవంతుడు ఉంటాడని నమ్ముతారు.
ఫాలభాగం బ్రహ్మస్థానం. మనలోని జీవాత్మ జ్యోతిస్వరూపంగా ఫాల భాగంలో ఉంటుందని అంటారు. అందుకే బొట్టు అక్కడే పెట్టుకోవాలి
ఫాలభాగంలో ఆజ్ఞా చక్రం ఉంటుంది. దానిని మేల్కొలిపేందుకు బొట్టు పెట్టుకుంటారు
పూర్వకాలం చాతుర్వర్ణాల వారు వారి వారి వృత్తి, వర్ణాన్ని అనుసరించి తిలక ధారణ చేసేవారు. వారి తిలకం వారికి ఒక గుర్తింపు.
బ్రాహ్మణులు పౌరోహిత్యం చేసే వారు తెల్లని చందనాన్ని తిలకంగా నుదుటన ధరించేవారు. క్షత్రియులు వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమ ధరించేవారు
వైశ్యులు సంపదకు చిహ్నంగా పచ్చని కేసరిని, శూద్రులు నల్లని భస్మాన్ని నుదటన తిలకంగా ధరించేవారట.
విష్ణు భక్తులు చందన తిలకాన్ని నామంగా, శివభక్తులు భస్మ త్రిపుండ్రాన్ని, దేవి ఉపాసకులు ఎర్రని కుంకుమ బొట్టును తిలకంగా ధరిస్తారు.
జ్ఞాపక శక్తి వృద్ధికి శక్తి స్థానమైన నుదుటన, కనుబొమ్మల మధ్య తిలక ధారణ చేస్తారు. అన్ని వ్యవహారములలో ధర్మబద్ధంగా నడచుకుంటాను అని దేవుడికి మనం చేసే వాగ్ధానంగా దీన్ని భావించాలంటారు
నుదుట తిలకం ధరించకుండా చేసే దానం, హోమం, పుణ్య కార్యలు, తపస్సు ఏదైనా సరే నిష్ఫలమని శాస్త్రం ఘోషిస్తోంది. అంతేకాదు ముఖాన ధరించిన బొట్టు దిష్టి తగలకుండా కాపాడుతుందని నమ్మకం. Images Credit: Pinterest