పెళ్లిలో అప్పగింతలు ఎందుకు! హిందూ సంప్రదాయ వివాహంలో అప్పగింతలు ఆఖరి ఘట్టం వధువు తల్లిదండ్రులు వరుడికి, వరుడి కుటుంబానికి తమ కుమార్తెను అప్పగించే ఘట్టం ఇది అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది “అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా” అంటాడు కన్యాదాత “పుత్రుడితో సమానంగా పెంచిన ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభి మానాలతో కాపాడు.” అని మంత్రం అర్థం మిత్రుడిగా, ప్రియుడిగా, భర్తగా పాలించాలి.. బుజ్జగించాలి.. లాలించాలి..ప్రేమించాలని వరుడిని కోరుతారు అదే మంత్రం చదువుతూ వరుడి తల్లిదండ్రులు, తోబుట్టువుల చేతికి కూడా వధువుని అప్పగిస్తారు ఈ ఇంటి బిడ్డను మీ ఇంటి బిడ్డగా ఆదరించాలని చెబుతారు Images Credit: Pinterest