గరుడ పురాణంలో వివాహం అనివార్యమైన సంఘటనగా పరిగణించారు. వధూవరులకు తండ్రి వైపు తొమ్మిదవ తరం వరకు, తల్లి వైపు నుంచి ఏడవ తరం వరకు రక్త సంబంధం ఉండకూడదని చెబుతారు.
వివాహానికి సంబంధించిన అనేక విషయాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు. వివాహం తర్వాత స్త్రీ కొన్ని తప్పులు చేస్తే, ఆమె వైవాహిక జీవితం నాశనం అవుతుందని చెబుతారు.
పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు. భర్త తన భార్యకు దూరంగా ఉండాలనుకున్నా, భార్య తన భర్తతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాలి.
పెళ్లయిన మహిళ బంధువుల ఇంట్లోనో, స్నేహితుల ఇంట్లోనో, బంధువుల ఇంట్లోనో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఇది ఆమె వివాహ బంధంలో చీలికను సృష్టించవచ్చు
వివాహానంతరం స్త్రీలు భర్త అనుమతి లేకుండా లేదా అతనికి తెలియజేయకుండా ఒంటరిగా నిర్జన ప్రాంతాలకు లేదా తెలియని ప్రాంతాలకు వెళ్లకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను సృష్టించవచ్చు.
వివాహిత స్త్రీ.... పర పురుషులతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండకూడదు, పర పురుషులతో స్నేహం చేయకూడదు. మీరు వేరే మగవారితో కలివిడిగా ఉన్నట్లయితే వారి గురించి పూర్తిగా మీ భర్తకు చెప్పడం మంచిది.
పెళ్లయిన స్త్రీ ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం భార్యాభర్తల మధ్య గొడవలకు దారి తీస్తుంది.
గరుడ పురాణం ప్రకారం, వివాహిత స్త్రీ మత్తు పదార్థాలకు బానిస కాకూడదు లేదా వాటిని సేవించకూడదు. పెళ్లికి ముందు ఇలాంటి చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలేయడం అత్యంత అవసరం.