అన్వేషించండి

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు

చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం, వారి జ్ఞాపకార్థం ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటారు. అయితే చనిపోయిన వారి ఫోటోలను ఎక్కడపడితే అక్కడ పెట్టుకోవడం మంచిదికాదంటోంది వాస్తుశాస్త్రం.

వాస్తు పట్టించుకోనివారికి పర్వాలేదు కానీ ఫాలో అయ్యేవారికి మాత్రం అడుగేసినా తీసినా అంతా వాస్తుప్రకారమే ఉండాలంటారు. వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం సమయంలో ఫాలో అయ్యేవి మాత్రమే కాదు..ఇంట్లో అణువణువూ పాటించాల్సిన చాలా ఉంటాయి. వాటిలో ఒకటి, అందరకీ కామన్ గా వచ్చే డౌట్ చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడ ఉంచాలి, ఎక్కడ పెట్టకూడదనే. ఎందుకంటే చనిపోయిన వారి ఫొటోలు పెట్టేందుకు కూడా వాస్తు ఫాలో అవుతారు.. లేదంటే ఆ ఇంట సుఖ శాంతులు, సంతోషం హరించుకుపోతుందని వాస్తుపండితులు చెబుతారు.

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

చనిపోయిన వారి ఫొటోలు ఇంట్లో పెట్టుకోవడం, నిత్యం వారిని స్మరించుకోవడం వల్ల ఆ వారి ఆశీశ్సులు ఉంటాయని భావిస్తారు. అందుకే ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు తగిలిస్తారు. ఇంట్లో ఉంటే చాలుకదా అని ఎక్కడంటే అక్కడ పెడితే అనుకూల ప్రభావం మాటేమో కానీ ప్రతికూల ప్రభావం ఆ ఇంటిపై పడుతుందంటారు. ఎందుకంటే చాలా మంది చనిపోయినవారిపై అత్యంత ప్రేమ లేదా భక్తితో దేవుడి మందిరంలో పెడుతుంటారు. ఇంకొందరు బెడ్ రూమ్స్ లో, డైనింగ్ రూమ్స్ లోనూ తగిలిస్తుంటారు. అస్సలు ఇలా చేయకూడదని చెబుతారు వాస్తుపండితులు.

Also Read:  ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

  • చనిపోయిన వారి ఫొటోలు దేవుడి మందిరంలో పెట్టకూడదు, ఇలా చేస్తే ఆ ఇంట సమస్యలు పెరుగుతాయి
  • బెడ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు వెంటాడతాయి
  • చనిపోయిన వారి ఫొటోల పక్కన బతికుండే వారి ఫొటోలు ఉండకుండా చూసుకోవాలి. కాదు కూడదు అంటే ఆ ప్రభావం బతికున్న వారి ఆయుష్షుపై పడుతుందట
  • ఇంతకీ చనిపోయిన వారి ఫొటోలు ఎక్కడపెట్టాలంటే కేవలం దక్షిణం వైపున్న గోడకు మాత్రమే. ఎందుకంటే దక్షిణ దిక్కు యముడి స్థానం. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో అకాల మరణాలు సంభవించవని, కుటుంబ సభ్యులు ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారని అంటారు.
  • దక్షిణంవైపు గోడకు చనిపోయిన వారి ఫొటోలు వేలాడదీసినట్టే..వాటికి ఎదురుగా ఉత్తరం వైపు గోడకు ఆంజనేయుడి ఫొటో పెడితే ఇంకా మంచిదంటారు.

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి

 నోట్: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

టాప్ హెడ్ లైన్స్

2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
2026 ఆగష్టు 14 శ్రావణ శుక్రవారం మొదటివారం పూజా విధానం - లక్ష్మీదేవి అనుగ్రహం కోసం!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
ఆగష్టు 21న వరలక్ష్మీ వ్రతం: తిరుచానూరులో వైభవంగా ఏర్పాట్లు, టికెట్లు నేటి నుంచే!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
తేనెటీగల వాగిల్ డాన్స్: ప్రకృతి నేర్పే అద్భుత ఆధ్యాత్మిక పాఠం!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget