అన్వేషించండి
Advertisement
Spirituality-Vastu: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి
మీ ఇంట్లో అక్వేరియం ఉందా, ఉంటే ఏ దిక్కున పెట్టారు, ఎంత సైజ్ ఉంది..ఇంతకీ ఇంట్లో అక్వేరియం ఉండొచ్చా ఉండకూడదా. పురాణాలు ఏం చెబుతున్నాయ్-వాస్తుశాస్త్రం ఏమంటోంది...
వాస్తు పట్టింపు ఉన్నవారికి ఇంట్లో ప్రతి అడుగూ సెంటిమెంటే. ఏ దిక్కున ఏం పెట్టాలి, అసలు ఇంట్లో ఏం ఉండొచ్చు, ఏ ఉండకూడదనే సందేహాలు చాలా ఉంటాయి.వీటిలో భాగమే అక్వేరియం. ఇంట్లో ఉండొచ్చని కొందరు..ఉండకూడదని కొందరు చెబుతారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే....
- హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి 9 అవతారాల్లో మత్స్యావతారం ఒకటి. అంటే భూమండలపై ఉన్న సకలచరాచర జీవులన్నీ పూజకు అర్హులే అని పురాణాల ఉద్దేశం.
- సైన్స్ పరంగా చూస్తే చేపలు....నెగెటివ్ తరంగాలను తమలో ఇముడ్చుకుని చాలా చక్కటి అనుకూల తరంగాలను బయటికి విడుదల చేస్తుందట
- ఇంట్లో అక్వేరియం ఉంటే ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది
- ఆర్థిక ఇబ్బందులు, సంతానలేమి సమస్యలకు చెక్ పెట్టి అదృష్టాన్ని అందిస్తుందట అక్వేరియం
- ఒక్కమాటలో చెప్పాలంటే అదృష్టానికి, ఇంట్లో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ అక్వేరియం
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
ఎన్ని చేపలు ఉండాలి
- అక్వేరియంలో 9 చేపలు ఉండేలా చూసుకుంటే మంచిది
- వాటిలో 8 డ్రాగన్ చేపలు కాని, 8 గోల్డ్ ఫిష్‌లు కాని ఉండాలి. మిగిలిన ఒకటి కచ్చితంగా నల్లచేప ఉండాలి
- డ్రాగన్ చేపలు, గోల్డ్ ఫిష్‌లు ఇంటి నుంచి దూరమైన అదృష్టాన్ని తిరిగి తీసుకొస్తాయి
- నల్ల చేప... ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది
- అక్వేరియంలోని ఓ చేప చనిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు..మరో చేపను తీసుకొచ్చి వేయండి
- చనిపోయిన చేపని ఇంటి బయట మట్టిలో పాతేయండి, అలాంటి చేపనే తిరిగి అక్వేరియంలో చేర్చండి
- ఎప్పటికప్పుడు లెక్క తొమ్మిదికి తగ్గకుండా చూసుకుంటే ఇంట్లో అంతా శుభమే
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది
పంచభూతాలు ఉండాలి
- పంచభూతాలైన.. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం ఇవన్నీ అక్వేరియంలో ఉండేలా చూడాలి
- అక్వేరియంని స్వచ్ఛమైన నీటితో తగినంత పరిమాణంలో నింపాలి
- అక్వేరియం లోపలి భాగంలో చిన్నచిన్న మొక్కలు ఏర్పాటు చేయాలి
- అక్వేరియం లోపల ఏదైనా లోహంతో ఓ ఆకృతి ఉంచాలి
- రాళ్లు, గులకరాళ్లను లోపల అడుగుభాగాన ఏర్పాటు చేయాలి
- ఐదవది ముఖ్యమైనది అగ్ని. ఇందుకోసం లోపల లైట్ వెలుగు పడేలా ఏర్పాటు చేయాలి
Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి
అక్వేరియం ఏ ప్రదేశంలో ఉంచాలి
- అక్వేరియం పెడితే మంచిది..అందుకే పెట్టాం అంటే సరిపోదు. ఏ దిశగా ఉంచాలన్నది కూడా చూసుకోవాలి. వాస్తుకు తగ్గట్టుగా సరైన ప్రదేశంలో ఉంచాలి
- సొంతిల్లు కదా అని అక్వేరియం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మీ ఇల్లు గుల్లైపోతుంది
- అక్వేరియం ఉంచాల్సిన సరైన ప్రదేశం డ్రాయింగ్ రూమ్...అక్కడ కూడా వాస్తు ప్రకారం తూర్పు దిశగా కాని, ఉత్తర దిశగా కాని ఉండాలి
- రాత్రిళ్లు అందంగా కనిపిస్తుంది కదా అని బెడ్ రూమ్ లో ఉంచితే దంపతుల మధ్య , కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి
- వంటింట్లో ఉంచితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది
- అక్వేరియం ఎదురుగా దుష్ట జంతువుల బొమ్మలు అస్సలు ఉంచొద్దు. డ్రాగన్, పులి, అనకొండ, సింహం వగైరా వగైరా బొమ్మలు.
- సమయానికి తగ్గట్టుగా అక్వేరియంలోని పాత నీరును తీసేసి కొత్త నీరును నింపుతుండాలి
- ఇంట్లో కానీ, కార్యాలయంలో కానీ సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు ఆ ప్రదేశాల్లో వాస్తు నిబంధనల ప్రకారం అక్వేరియం ఉంచండి.
Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion