Vastu Shastra-Spirituality: ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆపేశారా, అయినప్పటికీ ఈ పనులు మాత్రం పూర్తిచేయాల్సిందే
ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత కొన్ని కారణాలతో మధ్యలోనే ఆపేస్తారు కొందరు. ఆ తర్వాత ఎప్పుడో పూర్తిచేసే ఆలోచన ఉన్నప్పటికీ వాస్తు ప్రకారం ప్రస్తుతానికి పూర్తిచేయాల్సిన పనులుకొన్ని ఉంటాయి..అవేంటంటే…
ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు..ఇంకా వివిధ కారణాలతో ఇంటినిర్మాణానికి తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది. కొన్నిసార్లు మధ్యలోనే ఆపేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందుగా చేయాల్సిన పనులేంటి, పెండింగ్ పెట్టాల్సిన పనులేంటన్నది క్లారిటీ ఉండాలి. ఈ పద్ధతులు ఫాలో అవకపోతే వాస్తు దోషాల నుంచి తప్పించుకోలేరు అంటారు వాస్తు పండితులు.
ఇంటి నిర్మాణం మధ్యలో ఆపేయాల్సి వస్తే వాస్తు ప్రకారం ముందుగా ఏం పూర్తిచేయాలి, ఏ పనులు పెండింగ్ పెట్టాలి
- ఇంటిలోపల ఫ్లోరింగ్ ఆపొచ్చు కానీ వాస్తు రీత్యా ఆర్డినరీ గచ్చు వేయాలి. ఇంటి లోపలలో లెవల్ పెట్టకూడదు
- లోపల గదులకు ద్వారాలు, కిటికీలు, కప్ బోర్డులు, షో కేసులకు సంబంధించిన చెక్కపని ఆపొచ్చు
- ఇంటిలోపల టాయ్‌లెట్ కోసం గది నిర్మించినప్పటికీ లోపల పనిముట్లు పెట్టకుండా వాయిదా వేయొచ్చు
- ఫ్లోరింగ్‌కు సంబంధించి అన్ని గదుల్లోనూ టైల్స్ పని ఆపుకోవచ్చు
- ఇంటి ఆవరణలో సిమెంట్ పనులు ఆపొచ్చు కానీ మట్టితో లెవెల్ చేయించాలి
- పూజగది కట్టిన తర్వాతే దానిలో అలంకరణకు సంబంధించిన పని చేయాలి
- గ్రిల్‌కు సంబంధించిన పనులు, కాంపౌండ్ గేట్లు ఆపుచేసుకోవచ్చు, మెట్ల నిర్మాణం కూడా వాయిదా వేసుకోవచ్చు
- కిటకీలకు గుమ్మాలకు రంగులు వేయటాన్ని ఆపొచ్చు
- కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆపుకోవచ్చు కానీ గోడ మాత్రం సరిగా ఉండేలా చూసుకోవాలి
- శ్లాబు వాస్తురీత్యా వాటం సరిగా లేనప్పుడు శ్లాబుపై ప్లాస్టింగ్, ఫినిషింగ్ తప్పనిసరిగా చేయాలి
- ఇంటిలోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి
- అదేవిధంగా గృహ ఆవరణలో మట్టి నింపే పని అసంపూర్ణంగా ఆపకూడదు
- మేడ మీద,మెట్ల మీద పిట్ట గోడలు కట్టకుండా ఆపకూడదు
- గృహ నిర్మాణం పూర్తైన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు
- గృహనిర్మాణం పూర్తైన తర్వాత గృహ ఆవరణలో ఆగ్నేయం, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశల్లో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించకూడదు.
గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి.
గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది
Also Read: అద్దె ఇల్లు అయినా వాస్తు నియమాలు కొన్ని పాటించాలి, లేదంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తప్పవ్