Spirituality-Vastu: అద్దె ఇల్లు అయినా వాస్తు నియమాలు కొన్ని పాటించాలి, లేదంటే అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు తప్పవ్
సొంతిల్లు అయితేనే వాస్తు నియమాలు పాటిస్తాం...అద్దెంటికి అవసరం లేదనుకుంటున్నారా..ఇది సరైన ఆలోచన కాదంటున్నారు వాస్తు పండితులు. అద్దె ఇంటి వాస్తు సరిగ్గా ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుందంటున్నారు..
సొంతఇల్లైనా, అద్దె ఇల్లైనా వాస్తురీత్యా ఉండాల్సిందే. సొంతింటి కల నెరవేరాలంటే అప్పటి వరకూ అద్దెకు ఉండే ఇల్లు కూడా వాస్తురీత్యా బావుండాలి. మీరు ఉండేది ఉర్లో అయినా సిటీలో అయినా, ఇండివిడ్యువల్ అయినా అపార్ట్ మెంట్ అయినా వాస్తురీత్యా ఉండడం చాలా ముఖ్యం. వాస్తు అత్యద్భుతంగా లేకపోయినా కనీసం పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. వాటిని విస్మరిస్తే మీ జీవితం ఏకంగా అద్దెఇంటికే అంకింతమైపోతుంది. అదే అన్నివిధాలుగా సరిగ్గా వాస్తుండే ఇంట్లో అద్దెకు ఉంటే ఆస్తులు కలసిరావడమే కాదు సొంతింటి కల కూడా నెరవేరుతుంది. ఇంతకీ అద్దెంట్లో వాస్తుపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
అద్దె ఇంట్లోకి వెళ్లేముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు
- నైరుతి, దక్షిణ, పశ్చిమం వైపు మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి.
- ఆగ్నేయంలో వంట గది ఉండాలి
- ఈశాన్యంలో ద్వారం,గృహం మధ్యన ఖాళీ ఉండటం అవసరం
- నైరుతిలో బాల్కనీ ఉండరాదు
- ఇల్లు దిక్కులు క్రాస్ గా కాకుండా సరిగా ఉండాలి
- ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండాలి, వృత్తాకారంలో అస్సలు ఉండకూడదు
- నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు
- ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి
- వీధిపోట్లు, రోడ్డునుంచి పల్లంగా ఉన్న ఇళ్లు మంచివికావు
- టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే
ఇవేకాదు..అదే ఇంట్లో మీకన్నా ముందు అద్దెకు ఎవరున్నారు, వాళ్లకి కలిసొచ్చిందా మరింత నష్టపోయారా, ఏవైనా ఇబ్బందులు పడ్డారా, యాక్సిడెంట్లు ఏమైనా జరిగాయా, ఇంకా అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు జరిగాయా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆ పోర్షన్ తరచూ ఖాళీ అవుతోందా అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే వాస్తు బావున్న ఇళ్లు తరచూ ఖాళీ అవవు.
గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి.
గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది
Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి