Varalakshmi Vratam Puja Vidhi 2024 : శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఎలా పూజ చేయాలి - వరలక్ష్మీ వ్రతం రోజు కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి!
Shravana Masam 2024: శ్రావణమాసం మొత్తం పూజల సందడే. ప్రతిశుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు...అయితే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాలు మరింత ప్రత్యేకం. నాలుగు వారాలు పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి
Simple Varalakshmi Pooja at Home: వరలక్ష్మీవ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ప్రత్యేక నియమాలు, కులాలు అనే ప్రస్తావనే లేదు. అమ్మవారిపై ఉండే భక్తి శ్రద్ధలే ప్రధానం. అయితే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ వ్రతాన్ని భర్తతో కలసి ఆచరించడం అత్యుత్తమం. సాయంత్రం జరుపుకునే పేరంటం, వాయనాలు అన్నీ మహిళలే చేసుకోవచ్చు కానీ పూజ మాత్రం ఇద్దరూ కలసి చేస్తే ఇంకా మంచిదని సూచిస్తున్నారు పండితులు. అయితే వరలక్ష్మీ వ్రతం ఆచరించిన రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి.
Also Read: శ్రావణమాసంలో బంగారం తప్పనిసరిగా కొంటారు..ఎందుకో తెలుసా!
శుక్రవారం లక్ష్మీ పూజ ఇంట్లోనే ఇలా సులువుగా చేసుకోవచ్చు
1. పీఠం - కలశం ఏర్పాటు చేసుకోండి.
కలశంలో నీళ్లుపోసి కొబ్బరికాయ పెట్టి అమ్మవారి రూపు పెట్టి మీకు వచ్చినట్టుగా అందంగా అలంకరణ చేసుకోండి. కలశం పెట్టే అలవాటు లేనివారు అమ్మవారికి అలంకరణ చేసుకుని పూజచేసుకోవచ్చు
2. ఆచమనీయం చేసి, సంకల్పం చెప్పుకుని , కలశారాధన... గణపతి పూజ చేయాలి . షోజశోపచార పూజ అనంతరం అంగపూజ, అష్టోత్తరం, కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, ధూపదీపనైవేద్యాలు సమర్పించాలి.
3. వరలక్ష్మీవ్రతంలో ముఖ్యమైనవి వాటిలో మొదటిది తోరం. నవసంఖ్య అంటే అమ్మవారికి ప్రీతికరం. అందుకే తొమ్మిది దారాలు తీసుకుని తొమ్మిది పూలు పెట్టి తోరం పూజ చేయాలి. తోరం పూజకోసం తొమ్మిది నామాలుంటాయి.. అవి చదువుకుంటూ పసుపు, కుంకుమతో తోరం పూజ చేయాలి. పూజ తర్వాత తోరాన్ని కట్టించుకోవాలి..ఈ సమయంలోనూ ఓ శ్లోకం చదవాలి. అనంతరం వ్రతకథ చెప్పుకోవాలి. వ్రతకథ తర్వాత వాయనాలు ఇవ్వాలి.
Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!
ప్రతి శుక్రవారం అమ్మవారి పూజకు ఇదే పద్ధతి అనుసరించాలి. వరలక్ష్మీవ్రతం చేసినరోజు పీఠం, కలశం పెట్టుకుంటారు..మిగిలిన శుక్రవారాల్లో ఆ రెండు లేకుండా ఇదే పూజా విధానం అనుసరించవచ్చు. అయితే మిగిలిన రోజుల్లో వినాయక పూజ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు.. వక్రతుండ మహాకాయ శ్లోకం చెప్పుకుని గణపతి ప్రార్థన తర్వాత శ్రీ మహాలక్ష్మి పూజ చేసేసుకోవచ్చు.
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం మొత్తం పూజా విధాన మంత్రాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి....
ఈ ఏడాది ఆగష్టు 16 శుక్రవారం వరలక్ష్మీవ్రతం వచ్చింది. వరలక్ష్మీవ్రతం చేసుకునే ఆనవాయితీ లేనివారు కలశం, తోరం హడావుడి లేకుండా లక్ష్మీపూజ చేసుకోవచ్చు. వ్రతానికి నియమాలుంటాయి కానీ అమ్మవారి షోడశోపచార పూజను వితంతువులు కూడా ఆచరించవచ్చు. వ్రతం పూర్తైన తర్వాత కలశంపై కొబ్బరికాయ తీసేసి నీటిలో వదిలేయండి. ఆరు నెలలు నిండిన గర్భిణిలు ఈ వ్రతం చేయాల్సిన అవసరం లేదు కానీ అమ్మవారికి షోడసోపచారపూజ చేసుకోవచ్చు. ఏటి సూతకం, అశౌచంలో ఉన్నవారు ఈ వ్రతం ఆచరించకూడదు.
లక్ష్మీ గాయత్రి
మహా దేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యైచ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వినుతాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందేముకుంద ప్రియాం