వరలక్ష్మీవ్రతంలో భాగంగా తోరానికి ఇలా పూజచేయాలి!

తయారు చేసిన తోరాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షింతలు, పూలతో ఇలా పూజచేయాలి

కమలాయైనమః ప్రథమగ్రంథిం పూజయామి
రమాయైనమః ద్వితీయ గ్రంథిం పూజయామి

లోకమాత్రేనమః తృతీయ గ్రంథిం పూజయామి
విశ్వజనన్యైనమః చతుర్థ గ్రంథిం పూజయామి

మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి
క్షీరాబ్ది తనయాయై నమః షష్ఠమ గ్రంథిం పూజయామి

విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి
చంద్రసోదర్యైనమః అష్టమ గ్రంథిం పూజయామి

శ్రీ వరలక్ష్మీయై నమః నవమ గ్రంథిం పూజయామి

తోరం పూజ అనంతరం.. ఈ శ్లోకం చదువుతూ తోరాన్ని చేతికి కట్టుకోవాలి

బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

పూజా విధానం కన్నా అమ్మవారిపై మీకుండే భక్తి ప్రధానం అని గుర్తించాలి... Image Credit: playground.com