నిజంగా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలనుకుంటే..! నాలుగు రోజుల ముందు నుంచీ వ్రతానికి ఏం కావాలో లిస్ట్ సిద్ధం చేసుకోవాలి దీపం, ధూపం, నైవేద్యం, అలంకరణ సామగ్రి ఇవన్నీ ముందుగానే తీసి పెట్టుకోవాలి పూజ అంటే..మీరు పీటలపై కూర్చున్నప్పుడు ప్రారంభం కావడం కాదు పూజ బాగా జరగాడనికి మీరు ముందు చేసే సాధన మొత్తం పూజలో భాగమే అందుకే ఏ పూజకు అయినా నాలుగురోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకోవాలి పూజ ప్రారంభించిన తర్వాత అవసరమైన వస్తువుల కోసం వెతుక్కోవడం సరికాదంటారు పండితులు శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు ఈ ఏడాది 2024 లో శ్రావణ శుక్రవారం , వరలక్ష్మీ వ్రతం ఆగష్టు 16న వచ్చింది Image Credit: playground.com