అన్వేషించండి

Ugadi Rasi Phalalu In Telugu 2024 to 2025 : వృషభ రాశి శ్రీ క్రోధి నామ సంవత్సర ఫలితాలు - ఉగాది పంచాంగం 2024 to 2025!

Happy Ugadi 2024 to 2025: శ్రీ క్రోథి నామ సంవత్సరం వృషభ రాశి వార్షిక ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి...

Sri Krodhi Nama Samvatsaram 2024 to 2025 Taurus Yearly Horoscope : శ్రీ క్రోధి నామసంవత్సరం వృషభ రాశి ఫలితాలు

వృషభ రాశి  :  కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 7 అవమానం : 3

శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశివారికి బాగా కలిసొస్తుంది. శని శుభస్థానంలో, గురుడు సంవత్సరం మొత్తం జన్మంలో ఉండడం వల్ల మీకు మంచి అనకూల సమయం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రారంభించిన కార్యాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులు పొందుతారు. అయితే కొన్ని ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టపోతారు, అపనిందలు, అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలున్నాయి జాగ్రత్త. దీర్ఘవ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వృషభ రాశి ఉద్యోగులకు
ఈ రాశి ఉద్యోగులకు క్రోధి నామ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తోంది. విదేశాలలో ఉద్యోగాలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు తప్పవు. ఉన్నతాధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగులు పని ప్రదేశం మారే సూచనలున్నాయి.

వృషభ రాశి వ్యాపారులకు
ఈ ఏడాది వృషభ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. హోల్ సేల్, రీటైల్ రంగంలో ఉండే వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూల సమయం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కొంత నష్టపోకతప్పదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం.

కళాకారులకు
ఈ ఏడాది కళాకారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఎంత కష్టపడినా అవార్డులు , రివార్డులు పొందడం కష్టమే. టీవీ, సినిమా రంగాల్లో ఉండేవారికి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయి..

Also Read:  మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి!

రాజకీయ నాయకులకు
వృషభ రాశి రాజకీయ నాయకులకు క్రోధి నామ సంవత్సరం అనుకూల సమయం. ప్రజల్లో, అధిష్టాన వర్గాల్లోనూ మంచి పేరు సంపాదిస్తారు. ధనం మంచి నీళ్లలా ఖర్చవుతుంది కానీ ఉన్నత పదవులు లభిస్తాయి. మీ చుట్టూ ఉండేవారే మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్త వహించండి.  

విద్యార్థులకు
శ్రీ క్రోధి నామ సంవత్సరం విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందడం కష్టమే. చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి సారిస్తారు. చెడు స్నేహాల వల్ల నష్టపోతారు. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి. ఎంట్రన్స్ పరీక్షలలో ఆశించిన ర్యాంక్ పొందలేరు. క్రీడాకారులకు పర్వాలేదు.

వ్యవసాయదారులకు
ఈ రాశి వ్యవసాయదారులకు పంటలో మంచి దిగుబడి వచ్చినా ఆశించిన స్థాయిలో లాభం రాదు. ప్రకృతి వైపరీత్యాలు పంటనష్టాన్ని మిగులుస్తాయి.  చేసిన అప్పులు తీర్చలేరు..కౌలుదార్లకు మరింత కష్టకాలం.

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

వృషభ రాశి స్త్రీలకు
ఈ రాశి స్త్రీలు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. గర్భిణులకు ఎలాంటి సమస్యలు ఉండలు. ఉద్యోగం చేసే స్త్రీలకు కొన్ని సమస్యలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో విజయం మీదే...

ఓవరాల్ గా చెప్పాలంటే శ్రీ క్రోధి నామ సంవత్సరం వృషభ రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో అనుకూలత, మరికొన్ని వ్యవహారాల్లో ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది.ఎంతో కష్టపడితే కానీ సాధారణ ఫలితం అందుకోలేరు...

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget