By: RAMA | Updated at : 27 Jan 2023 10:34 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pinterest
Suryanar Kovil Ratha Saptami 2023 Special: జనవరి 28 శనివారం రథసప్తమి..ఈ సందర్భంగా జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగించే సూర్యనార్ ఆలయం గురించి ప్రత్యేక కథనం.
ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ |
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
నవగ్రహాల్లో సూర్యభగవానుడిది కీలకస్థానం. యావత్ జగతికి వెలుగునిచ్చే ప్రత్యక్షదైవం సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలసి వెలసిన ప్రాంతమే కుంభకోణంలో సూర్యనార్ దేవాలయం. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో సూర్యభగవానుడు మధ్యలో ఉంటే చుట్టూ మిగిలిన 8 గ్రహాల ఆలయాలు ఉన్నాయి. సాధారణంగా నవగ్రహాల ఆలయంలో శివుడు ప్రధానంగా ఉంటే.. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో ఉన్న సూర్యనార్ ఆలయంలో మాత్రం సూర్యుడే ప్రధానం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చని చెబుతారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
Also Read: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
చోళులు నిర్మించిన ఆలయం
సూర్యనార్ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు. ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది. ఈ ఆలయంలో మూలవిరాట్టు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరు భార్యలతో భక్తులకు దర్శనమిస్తాడు. వాస్తవానికి సూర్యుడు తీక్షణమైన కిరణాలతో ఉంటే..ఇక్కడ స్వామివారు మాత్రం అందుకు భిన్నంగా మందహాసంతో రెండు చేతుల్లో తామరపూలు పట్టుకుని ఆశీర్వచనం అందిస్తున్నట్టు దర్శనమిస్తాడు. పరమశివుడికి ఎదురుగా నంది ఉన్నట్టే సూర్యుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది.
రథసప్తమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ.
Also Read: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!
కుజ దోశం, శని దోషం పోవాలంటే
కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాలు..కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ ఆగ్రహంతో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారుడైన పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తులను చేసి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటే వారికి ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం లభిస్తుందని పరమేశ్వరుడు వరమిచ్చాడని పురాణగాథ. అందుకే కుజ దోషం, ఏలినాటి శనిదోషం, జాతకచక్రంలో రాహు,కేతు దోషాలు లాంటివి సూర్యనార్ ఆలయాన్ని దర్శించుకుంటే తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు.
తులాభారంగా బెల్లం,గోధమలు
తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఈ ఆలయానికి సమర్పించుకుంటారు. ఈ ఆలయంలో పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చేయమని చెబుతారు. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.
Ramadan 2023: రంజాన్ ఉపవాస దీక్షలు ఎందుకంత కఠినంగా ఉంటాయి, దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!
మార్చి 24 రాశిఫలాలు, ఈ రాశివారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కొత్త అవకాశాలు లభిస్తాయి
Ramdan 2023: రంజాన్ మాసం ఎందుకంత ప్రత్యేకం? పవిత్ర ఖురాన్‌లో ఏం పేర్కొన్నారో తెలుసా?
Ramadan 2023: ఈ సారి మన దేశంలో ఈద్ కా చాంద్ ఆలస్యం
సూర్యస్తమయం వేళ ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే!
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు