మేష రాశి ఈ రాశి ఉద్యోగులకు పురోభివృద్ధితో పాటూ ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీరు ఓ చెడు పనిలో విజయం సాధిస్తారు. రోజంతా సంతోషంగా ఉంటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
వృషభ రాశి ఈ రోజంతా ప్రయాణంలో గడిచిపోతుంది. కార్యాలయ పనులతో బిజీగా ఉంటారు.బంధువులను కలుస్తారు. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.
మిథున రాశి ఈ రోజు మీకు ఆకస్మిక ద్రవ్య లాభాలు అందవచ్చు. పనిలో శ్రమ తర్వాత విజయం తక్కువగా ఉంటుంది... కొంత ఓపిక అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవడం మంచిది
కర్కాటక రాశి ఈ రోజు ఈ రాశి వ్యాపారులు, ఉద్యోగులకు మంచి రోజు. ఉద్యోగులకు ఉన్నతాధికారులనుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బావుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహ రాశి ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కెరీర్ పరంగా కొన్ని ప్రత్యేక మార్పులు ప్లాన్ చేసుకుంటారు. పిల్లల చదువుకి సంబంధించి కొంత సమయం కేటాయించండి. ఆహారం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వద్దు.
కన్యా రాశి ఈ రోజు మీ ప్రేమ జీవితానికి పరీక్షలా ఉంటుంది. మీ ప్రియమైన వారు మీతో చెప్పిన విషయం మిమ్మల్ని బాధిస్తుంది...కానీ ఓపికపట్టండి. కోపం తగ్గించుకోవడం మంచిది. కుటుంబానికి సమయం కేటాయంచండి
తులా రాశి ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి..ఇది మీ ఇబ్బందులకు కారణం కావొచ్చు. కుటుంబంతో మీ సమన్వయం బావుంటుంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విన్నాక..వారికి సహకరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి ఈ రోజు మీ మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. రాబోయే కొద్ది రోజుల్లో మీరు కొన్ని పెద్ద పని కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంతో కలిసి మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.
ధనుస్సు రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆదాయం పెరగడంతో పాటూ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. మీ ఆలోచనా విధానం బావుంటుంది...మంచి మార్గంలో జీవిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
మకర రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు..ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పెద్దగా మార్పులుండవు.
కుంభ రాశి ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తల్లిదండ్రుల నుంచి అనుమతి తీసుకుని వెళ్లడం మంచిది. బాధ్యతారహితమైన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది..
మీన రాశి ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈరోజు పూర్తవుతాయి. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. ప్రత్యర్థులను దూరం ఉంచుతారు. మీ ఆలోచన కుటుంబ సభ్యుల దృక్పథాన్ని మార్చవచ్చు.