మేష రాశి ఈ రోజు మీ భాగస్వామితో కలిసి నడిచే అవకాశం లభిస్తుంది. అవివాహితులు పెళ్లి విషయంలో మనసు మార్చుకుంటారు. ఈ రాశివారు ప్రేమికులపై కోపంగా ఉంటారు.
వృషభ రాశి భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అనవసర వాదనలకు దిగొద్దు. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లేని సమస్య ఉండదని అర్థం చేసుకోండి.
మిథునం రాశి ఈ రోజు మీ భాగస్వామి మీ అంచనాలకు అనుగుణంగా జీవించలేరు. పరస్పర విభేదాలను మరచి బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ ప్రేమ భాగస్వామితో కలసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు
కర్కాటక రాశి జీవితంలో ఇప్పటి వరకూ సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. పెళ్లికానివారి అన్వేషణ ఫలిస్తుంది.
సింహ రాశి ఈ రోజు ప్రేమ జీవితంలో మరపురాని రోజు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడపబోతున్నారు. రొమాంటిక్ లైఫ్ లో మరపురాని క్షణాలు రాబోతున్నాయి. ప్రేమ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది.
కన్యా రాశి కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా ఇంటి వాతావరణం ప్రేమపూర్వకంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ జీవితంలో భాగస్వామి నుంచి ఒత్తిడి తలెత్తవచ్చు. ప్రేమికుడికి మీపై కోపం వస్తుంది.
తులా రాశి ఈ రాశివారి వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఈరోజు సమసిపోతాయి. మీ జీవితంలో చీకట్ల తొలగి వెలుగు నిండబోతోంది. ఆత్మీయులతో ప్రేమను ఆస్వాదిస్తారు. ప్రేమబంధం బలంగా ఉంటుంది.
వృశ్చిక రాశి ఈ రోజు భాగస్వామికి సమయం కేటాయించండి..మీరు చూపించే కాస్త ప్రేమ వారికి కొండంత బలం అన్న విషయం గుర్తించాలి. ప్రేమికులకు ప్రత్యేక సమయం దొరుకుతుంది. రోజంతా ఆనందంగా ఉంటారు
ధనుస్సు రాశి ప్రేమ భాగస్వామితో మాటలు పరస్పరం ప్రేమను పెంచుతుంది. ప్రేమికులు మీ కొన్ని పనులపై కోపంగా ఉండవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.
మకర రాశి మీరు ప్రేమ భాగస్వామితో కలిసి నడుస్తారు. మీ భావాలను మీ జీవిత భాగస్వామితో బహిరంగంగా వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తారు. ఏదైనా శుభకార్యానికి జంటగా హాజరవుతారు.
కుంభ రాశి కుటుంబానికి సమయం కేటాయిస్తారు..బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కోపం తగ్గించుకుంటే మంచింది. మంచి ఆలోచన వల్ల మీరు మీ భాగస్వాని నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధం బలంగా ఉంటుంది.
మీన రాశి మీ సంబంధాలలో సాన్నిహిత్యం ఉంటుంది. పెళ్లికాని ఉద్యోగులు..కార్యాలయంలో జంటను వెతుక్కుంటారు. అవివాహితులకు శుభసమయం. వైవాహిక జీవితం బావుంటుంది.