Ratha Sapthami 2023: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!
రథసప్తమి: ఏటా మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు 'రథసప్తమి' జరుపుకుంటారు. ఆరోగ్యాన్నిచ్చే సూర్యుడి ఆరాధాన ఈ రోజు రెట్టింపు ఫలితాన్నిస్తుంది. రథసప్తమి ఏం చేస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుందో చూద్దాం..
![Ratha Sapthami 2023: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు! Ratha Sapthami 2023: What is special on Ratha Saptami, How To Do Ratha Saptami surya Puja, Know In telugu Ratha Sapthami 2023: రథసప్తమి రోజు తలపై జిల్లేడు ఆకులు -రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేయాలంటారెందుకు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/a4db28b5b50093970ab0f4155605dc871674109103197217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ratha Sapthami 2023: భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉన్నాయంటే అందుకు కారణం సూర్య భగవానుడు. అందుకే భానుడిని ప్రత్యక్షదైవం అంటారు. సూర్యారాధనకు అత్యుత్తమ రోజు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి నిత్యం సూర్యోదయం అయ్యే సమయానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నమస్కరించేవారెందరో. అయితే నిత్యం చేసే సూర్యనమస్కారం కన్నా రెట్టింపు ఫలితం రథసప్తమి రోజు దక్కుతుందంటారు పండితులు.
- రథసప్తమి రోజు ప్రాతఃకాల సమయంలో గంగలో స్నానాలు, సూర్యోపాసన వలన మృత్యుభయం పోతుందని విశ్వాసం. అందుకే రథసప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి
- తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్లు ఉంచుకుని స్నానం చేయాలి. జిల్లేడు ఆకుని అర్కపత్రం అంటారు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్యుడి రథానికి ఉండే ఏడు గుర్రాలకు, ఏడు జన్మల్లో చేసిన పాపాలకు, ఏడురకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు.
- నదుల దగ్గర స్నానమాచరించేవారు నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించి నీటిలో వదిలితే మంచిది
- రథ సప్తమిరోజున ఆవు నేతితో దీపారాధన చెయడం వల ఆ ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతారు.
- రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి, సంకాంత్రి రోజున పెట్టిన పిడకలు, గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగిస్తారు.
- పొంగిన పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు
- తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.
- రథసప్తమి రోజు సూర్యుడిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది.
- రథసప్తమి రోజు బంగారం, వెండి లేదా రాగి..ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్రరంగు సూర్యుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం ఇస్తే మంచిదంటారు.
- రథ సప్తమి రోజు ఉపవాసం ఉండి దైవారాథనలోనే కాలం గడిపితే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుని అనుగ్రహం పొందుతారని విశ్వాసం.
- ఈ రోజున ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోములను ఈ రోజు ప్రారంభిస్తారు
- ఈ రోజు ఏ పుణ్యకార్యం తలపెట్టినా విజయవంతగా పూర్తి అవుతుందని నమ్మకం
- సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారం అయిన సూర్యుడిని ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు, అనారోగ్యం, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు.
Also Read: కలలో ఇవి కనిపిస్తే మీ తలరాత మారబోతోందని అర్థం
"ఓం హ్రీం సూర్యాయ నమః"
॥ శ్రీ సూర్య స్తోత్రం ॥
ధ్యానం |
ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం
భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |
ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం
భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ ||
కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |
జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః ||
బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |
అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః ||
ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |
సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః ||
పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |
అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః ||
కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |
ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః ||
సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ]
క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ ||
సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |
ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |
సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ ||
ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |
Also Read: సూర్యకాంతిలో పొంగేపాలు సిరుల పొంగుకి సంకేతం, రథసప్తమి విశిష్టత ఇదే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)