Sleeping Rules In Dharma Grantha: ధర్మగ్రంథాల ప్రకారం ఇలా నిద్రపోవాలట - మరీ ఈ నియమాలు మీరు పాటిస్తున్నారా?
Sleeping Rules In Dharma Grantha: నిద్ర గురించి సైన్స్‌లోనే కాకుండా మన ధర్మ గ్రంధాలలోనూ ప్రస్తావించారు. ధర్మ గ్రంధాల ప్రకారం మనం ఎంతసేపు నిద్రించాలి? నిద్రపోవడం వల్ల ఏం లాభం..? ఎలా నిద్రపోవాలి?
Sleeping Rules In Dharma Grantha: శాస్త్రీయ విశ్వాసాల ప్రకారం, మనం సరిగ్గా నిద్రపోకపోతే, మన వయస్సు కంటే పెద్దవారిగా కనిపిస్తాము. ఏకాగ్రత తగ్గుతుంది. చిరాకు పెరిగి జ్ఞాపకశక్తి తగ్గుతుంది. మంచి నిద్ర మిమ్మల్ని విజయపథంలో నడిపించడంలో చాలా దోహదపడుతుంది. కాబట్టి నిద్ర గురించిన ఈ విషయాలన్నీ విజయానికి అవసరమైన నిచ్చెనను అధిరోహించడానికి తోడ్పడతాయని గ్రంథాలలో పేర్కొన్నారు. లఘు వ్యాస సంహిత, సంప్రతి సంహిత లేదా సుశ్రుత సంహిత వంటి మన గ్రంథాలలో మంచి నిద్ర కోసం ఈ సూచనలు ఇచ్చారు.
లఘ వ్యాస సంహిత ప్రకారం నిద్రించే విధానం
లఘు వ్యాస సంహిత ప్రకారం, నోరు తెరిచి, బట్టలు లేకుండా లేదా విరిగిన మంచం మీద నిద్రించకూడదు. మీరు పడుకునే ముందు ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోతే, నీటిలో ఉప్పు వేసి స్నానం చేయండి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఫలితంగా మంచి నిద్ర వస్తుంది.
Also Read : ఉపవాసానికి వ్రతానికీ మధ్య వ్యత్యాసం ఏంటి - రెండూ ఒకటి కాదా!
సంప్రతి సంహిత ప్రకారం నిద్రించే విధానం
సంప్రతి సంహిత ప్రకారం, నిద్రపోయేటప్పుడు తల శరీరం కంటే తక్కువ ఎత్తులో ఉండకూడదు. అంటే దిండు పెట్టుకుని పడుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ తలను మీ శరీరం కంటే ఎత్తుగా ఉంచుతుంది. నిద్రకు ఉపక్రమించే ముందు భగవన్నామాన్ని స్మరించుకుని ధ్యానం చేయాలి. వీలైతే ఈ సమయంలో మీరు కొన్ని భగవంతుడి మంత్రాలను కూడా పఠించవచ్చు.
ఈ సమయంలో నిద్రపోకండి
మహాభారతం, ధర్మ సింధు ప్రకారం పగటిపూట నిద్రపోకూడదు. మహాభారతం ప్రకారం పగటిపూట నిద్రపోవడం నిషిద్ధం. పగటిపూట నిద్రపోవడం మహాభారతంలోనే కాకుండా సుశ్రుత సంహితలో కూడా నిషేధమని స్పష్టంగా చెప్పారు. పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పగటిపూట నిద్రపోవచ్చు.
వీటిని ఉపయోగించవద్దు
నిద్రపోయేటప్పుడు టీవీ, కంప్యూటర్, ఫోన్ మొదలైన వాటికి దూరంగా ఉండి మానసిక ప్రశాంతతనిచ్చే ఏదైనా కథ, సంగీతం, గురువాణి లాంటివి వింటూ నిద్రించండి. పడుకునే ముందు 15-20 నిమిషాల పాటు కొద్దిసేపు నడవడం, తర్వాత పడుకోవడం మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాలలో గసగసాలు నానబెట్టి వాటిని తాగడం ఆ తర్వాత పడుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
Also Read : మొత్తం 108 రకాలు హారతులు , ఏ హారతి దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసా!
ఈ సమయంలో ధర్మ గ్రంధాలను చదవండి
మీకు చాలా పని ఉంటే నిద్రపోవడానికి సమయం దొరకదు, నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎదురైతే అలాంటి సమయాల్లో యోగ నిద్రను సాధన చేయాలి. కొంతమందికి ధార్మికపరమైన పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటుంది. అలాంటివారు నిద్రకు ఉపక్రమించే ముందు ధార్మిక గ్రంథాలను చదవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.