Spirituality: మొత్తం 108 రకాలు హారతులు , ఏ హారతి దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసా!
ఆలయాల్లో రకరకాల హారతులు ఇస్తుంటారు. అయితే పెద్ద పెద్ద ఆలయాల్లో, భారీ హోమాలు పూజలు చేసే సమయంలో రకరకాల హారతులివ్వడం చూస్తుంటాం. మరి ఏ హారతి దర్శించుకుంటే ఎలాంటి ఫలితమో తెలుసా...
Different Types Of Aarti Performed in Hinduism: హారతులు మొత్తం 108 రకాలు అని ఋగ్వేదం చెప్పింది. ఒక జ్యోతి మొదలు 108 జ్యోతుల వరకూ హారతులు లెక్కిస్తారు. అయితే జ్యోతుల సంఖ్య పెరిగేకొద్దీ వాటికి ప్రత్యేక మంత్రాన్ని నిర్ధేశించారు. ఓంకారహారతితో మొదలై 108 ని అష్టోత్తర హారతి అని పిలుస్తారు. జీవుడిని పరమాత్మవైపు నడిపించే కాగడానే హారతి. పూర్వకాలంలో పెళ్లిళ్లు జరిగేటప్పుడు, దేవాలయాల్లో దివిటీలు పట్టుకునేవారు...అది ఓంకార హారతి అని అంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైన హారతులు ఇవే...
ఓంకార హారతి
సృష్టికి మూలం ఓంకారం. అమ్మవారిని సృష్టి స్వరూపిణిగా పిలుస్తారు. ఓంకార నాదాన్ని వినడం, ఓంకార రూపాన్ని చూడటం వల్ల పాపాలు నశించి సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే మొదటగా ఓంకార హారతి ఇస్తారు.
నాగ హారతి
దేవతా స్వరూపమైన నాగ సర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించుకోవడం వల్ల సంతానం, సౌభాగ్యం పొందుతారు, రోగనివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. నాగదోషం ఉన్న వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడటం వల్ల సకల ఆ దోషం పోతుందంటారు.
Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!
పంచ హారతి
సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతి రూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తులకు పంచ మహాపాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలకు సాంత్వన కలుగుతుంది.
కుంభహారతి
సమాజానికి రక్షను కలిగించేది కుంభహారతి. మహిమాన్వితమైన కుంభ హారతిని దర్శించడం వల్ల... పంచ భూతాత్మకమైన జీవ రక్ష లభిస్తుంది. కుంభ హారతిని ఒక్కసారి చూస్తే చాలు మనసులో ఉన్న గందరగోళాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
సింహ హారతి
దుర్గామాత అమ్మవారి వాహనం సింహం. శత్రువులను శిక్షించి, ధర్మాన్ని రక్షించే తత్వానికి, ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహ హారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. మనిషిలో ఉన్న అసుర ప్రవృత్తి తొలగి సద్భావం పెంపొందుతుంది.
నంది హారతి
ఈశ్వరుని ప్రమథ గణాల్లో ఒకడు నంది. పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన వాహనం. ఈ హారతి భక్తులకు నిర్మలమైన భక్తి సకల ధర్మాచరణ అనే ఫల ప్రాప్తి అందిస్తుంది. పరమేశ్వరుని అనుగ్రహంతో జ్ఞానత్వం లభిస్తుంది.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
సూర్య హారతి
సూర్య హారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం సిద్ధిస్తుంది. దీనివల్ల ఆయుష్షు పెరుగుతుంది. సూర్య హారతి సందర్శించుకుంటే అనారోగ్యం తొలగిపోతుంది.
చంద్ర హారతి
చంద్రుడిని మనఃకారకుడు అంటారు. చంద్ర హారతి దర్శనం వల్ల భక్తుల్లో పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానగుణం వృద్ధి చెందుతాయి. మనస్సుకు స్వచ్ఛత చేకూరడంతోపాటు ప్రశాంతత కలుగుతుంది.
Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!
నక్షత్ర హారతి
27 నక్షత్రాల్లోనే కోట్ల మంది మానవులు జన్మిస్తుంటారు. మానవ జీవనానికి నక్షత్రాలుమూలం. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు అక్షయమైన పుణ్యం సిద్ధిస్తుంది.