Diwali 2023 Date and Time: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!
Diwali 2023 Date Telangana: తిథులు తగులు మిగులు వచ్చిన ప్రతీసారీ ఏరోజు పండుగ చేసుకోవాలో అనే కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఈసారి దీపావళి విషయంలో అదే డిస్కషన్ జరుగుతోంది. ఇంతకీ దీపావళి ఎప్పుడంటే...
Diwali 2023: దీపావళి వేడుకలు జరుపుకోవడంపై కొంత అయోమయం నెలకొంది. అమావాస్య తిథి తగులు, మిగులు రావడం వల్లే ఈ కన్ఫూజన్ మొదలైంది. నవంబరు 12 వ తేదీ ఆదివారం మధ్యాహ్నం నుంచి అమావాస్య ఘడియలు మొదలయ్యాయి..నవంబరు 13 సోమవారం మధ్యాహ్నం వరకూ అమావాస్య ఘడియలు ఉన్నాయి. సాధారణంగా హిందువుల పండుగలన్నీ తిథి సూర్యోదయానికి ఉండడమే లెక్క కానీ..దీపావళి అంటే సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగిస్తాం. అంటే అమావాస్య ఘడియలు సాయంత్రానికి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి. అందుకే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దీపావళి (Diwali Puja 2023) నవంబరు 12 ఆదివారం సెలబ్రెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పండితులు.
Also Read: అక్టోబరు 28 చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!
నరక చతుర్థశి - దీపావళి ఒకే రోజు
సాధారణంగా దీపావళికి ముందు రోజు నరక చతుర్థశి సెలబ్రేట్ చేసుకుంటారు. మరి దీపావళి నవంబరు 12 ఆదివారం అయితే నవంబరు 11 శనివారం నరక చతుర్థశి అవుతుందనుకోవద్దు. ఎందుకంటే చతుర్థశి తిథి మాత్రం సూర్యోదయానికి ఉన్నదే పరిగణలోకి తీసుకుంటారు. నవంబరు 12 ఆదివారం సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉండడంతో..అదే రోజు నరకతచతుర్థశి..సాయంత్రానికి అమావాస్య తిథి రావడం వల్ల అదే రోజు రాత్రి దిపావళి జరుపుకోవాలి. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదంటున్నారు పండితులు.
Also Read: పౌర్ణమి - అమావాస్యకి, చంద్రుడి హెచ్చుతగ్గులకు శివుడే కారణమా!
చతుర్థశి, అమావాస్య ఘడియల టైమింగ్స్ ఇవే - Diwali 2023 Date and Time
- నవంబరు 11 శనివారం మధ్యాహ్నం 12.50 వరకూ త్రయోదశి ఉంది..ఆ తర్వాత నుంచి చతుర్ధశి మొదలవుతోంది
- చతుర్థశి - శనివారం మధ్యాహ్నం 12.50 నుంచి నవంబరు 12 ఆదివారం మధ్యాహ్నం 1.53 వరకూ ఉంది
- అమావాస్య- నవంబరు 12 ఆదివారం మధ్యాహ్నం 1.54 నుంచి నవంబరు 13 సోమవారం మధ్యాహ్నం 2.23 వరకూ ఉంది
Also Read: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!
దీపావళి ఎందుకు జరుపుకుంటారు - Why is Diwali celebrated?
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా. దీపావళి గురించి పురాణకథనాల విషయానికొస్తే భూదేవి-వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు తాను తల్లిచేతిలో మాత్రమే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో ముల్లోకాలను ముప్పుతిప్పలు పెట్టడంతో భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీమహావిష్ణువుకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేస్తాడు. చతుర్దశి రోజు నరకుడు మరణించగా ఆ తర్వాతి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతారు. త్రేతాయుగంలో రావణుడిని హతమార్చి లంక నుంచి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు చేరిన సందర్భంగా ప్రజలంతా దీపావళి వేడుకలు జరుపుకున్నారని చెబుతారు. ఇక ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు. వాస్తవానికి దీపావళి ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదియతో ముగుస్తాయి. ధన త్రయోదశి, నరక చతుర్థశి, దీపావళి, బలి పాడ్యమి, యమ విదియ... మొత్తం 5 రోజుల పాటూ వేడుక సాగుతుంది.