శరద్ పూర్ణిమ , చంద్రగ్రహణం, గజకేసరి యోగాల అరుదైన కలయిక కొన్ని రాశులవారికి శుభాలనిస్తోంది.
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంద్రగ్రహానికి ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాల్లో గురు గ్రహం సంచరిస్తున్నప్పుడు ఈ మహాయోగం ఏర్పడుతుంది.
ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ఫలితాలుంటాయి
ఈ యోగం వల్ల ఈ నాలగు రాశులవారు ఆర్థికంగా అనూహ్యమైన పురోగతి సాధిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు.
వృషభ రాశి గ్రహణ ప్రభావం కారణంగా ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలలో ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో సక్సెస్ అవుతారు
మిథున రాశి చంద్రగ్రహణం ప్రభావం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
కన్యా రాశి చంద్రగ్రహణం కన్యా రాశి వారికి లాభం చేకూర్చుతోంది. వ్యాపారులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
కుంభ రాశి ఇప్పటివరకూ మీరు జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారు
ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబరు 28 శనివారం రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. Image Credit: Pinterest