చాణక్య నీతి: కుటుంబ సంబంధాలు బలపడాలంటే!



కుటుంబంలో గొడవలు రాకుండా బంధాలు బలపడాలంటే కొన్ని పాటించాల్సిందే అని బోధించాడు ఆచార్య చాణక్యుడు



1. నమ్మకం, గౌరవం
ఏదైనా సంబంధం నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుందంటాడు ఆచార్య‌ చాణక్యుడు



ఏ వ్యక్తినైనా పదే పదే అవమానిస్తే వారి ఆత్మగౌరవం దెబ్బతింటుందని, ఆ బంధం ఎక్కువ కాలం ఉండదని ఆచార్య చాణక్యుడు స్ప‌ష్టంచేశాడు.



2. అహం
అహంభావం ఉన్న సంబంధంలో అపోహ‌లు, ప‌ట్టింపులు రావడం సహజం. అహంభావం కారణంగా, సంబంధాల ప్రాముఖ్యత కోల్పోవడం ప్రారంభమవుతుంది



సంబంధాలలో అహాన్ని చూప‌డానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అహంభావం వల్ల సన్నిహిత సంబంధాలు తమ విలువలను కోల్పోతున్నాయని చాణక్యుడు చెప్పాడు.



3. సోమరితనం
సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు అని మీరు చాలా పుస్తకాల్లో చదివి ఉంటారు లేదా విని ఉంటారు. చాణక్యుడు తన చాణక్య నీతిలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు



సోమరితనం లేదా ఆశయం లేని వ్యక్తుల నుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండండి. అలాంటి వారి ప్ర‌భావం మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది లేదా మిమ్మల్ని వారిలాగే సోమరిగా మార్చేస్తుంది



Images Credit: Pinterest