Lunar eclipse Gajakesari Yogam 2023: శరద్ పూర్ణిమ, చంద్రగ్రహణం , గజకేసరి యోగం - ఈ 4 రాశులవారికి గోల్డెన్ టైమ్!
Gajakesari Yogam: బృహస్పతి , చంద్రుడు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు లేదా ఒకదానికొకటి ప్రత్యక్షంగా కనిపించినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది చంద్రగ్రహణం రోజు జరుగుతోంది..కొన్ని రాశులవారికి గుడ్ టైమ్..
Gajakesari Yogam: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి అక్టోబరు 28 శనివారం రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపిస్తుంది. విశేషమేంటంటే ఇదే రోజు గజకేసరి యోగం కూడా యాదృచ్ఛికంగా ఉంటుంది. శరద్ పూర్ణిమ , చంద్రగ్రహణం, గజకేసరి యోగాల అరుదైన కలయిక కొన్ని రాశులవారికి శుభాలనిస్తోంది.
గజకేసరి యోగం అంటే
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంద్రగ్రహానికి ఒకటి, నాలుగు, ఏడు, పదవ స్థానాల్లో గురు గ్రహం సంచరిస్తున్నప్పుడు ఈ మహాయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ఫలితాలుంటే మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ఫలితాలుంటాయి, మరికొన్ని రాశులపై మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యంగా ఈ నాలగు రాశులవారు ఆర్థికంగా అనూహ్యమైన పురోగతి సాధిస్తారు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఆ నాలుగు రాశుల్లో మీది ఉందా?
Also Read: అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!
వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
గ్రహణ ప్రభావం కారణంగా ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాలలో ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ కెరీర్‌లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో సక్సెస్ అవుతారు
మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
చంద్రగ్రహణం ప్రభావం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యాధి నుంచి ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. గృహ ఖర్చులు తగ్గడం వల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
Also Read: బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి మంచిరోజులు, అక్టోబరు 26 రాశిఫలాలు
కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)
చంద్రగ్రహణం కన్యా రాశి వారికి లాభం చేకూర్చుతోంది. గజకేసరి యోగం ప్రభావం కారణంగా అన్నీ మీకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి అవకాశం. వ్యాపారులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.
కుంభ రాశి (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
కుంభ రాశి వారికి గజకేసరి యోగం అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటివరకూ మీరు జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ప్రతికూలతల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.