Shanishchari Amavasya 2022: ఏప్రిల్ 30న శనివారం, అమావాస్య, సూర్యగ్రహణం-ఆ రోజున ఇలా చేయండి
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుంది. ఆ సమయంలో ప్రత్యేక పూజలు, పరిహారాలు చేసుకుంటారు. అయితే ఈసారి సూర్యగ్రహణం శని అమావాస్య, సూర్యగ్రహణం కావడంతో చాలా పవర్ ఫుల్ అంటున్నారు పండితులు..
వైశాఖ మాసంలో చివరి రోజు అమావాస్య. అయితే ఈసారి శనివారం రావడంతో చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు పండితులు. ఈ శనైశ్చర అమావాస్య రోజు శనిని పూజించడం వల్ల సకల గ్రహాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం కూడా. మన దేశంలో సూర్యగ్రహం ఏప్రిల్ 30 మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఇండియాలో ఈ ఏడాది ఏర్పడే తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది. పూర్తిగా కన్పించేది మాత్రం దక్షిణ, పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికా ప్రాంతాలున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే సూర్య గ్రహణం తెలుగు రాష్ట్రాలకు కాదు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే. శనైశ్చర అమావాస్య, సూర్యగ్రహణం కావడంతో కొన్ని శ్లోకాలు పఠించడం, పరిహారాలు చేసుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగి శుభం కలుగుతుందని విశ్వసిస్తారు.
శని అమావాస్య పరిహారాలు
- శని అమావాస్య రోజున శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల నూనె , నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి.
- ఏలినాటి శని,అష్టమ శని, అర్థాష్టమ శని దోషం తగ్గించుకునేందుకు ఆలయాల్లో శనికి నువ్వుల నూనె, నువ్వులు, నల్లటి వస్త్రం సమర్పించాలి
- ఈ రోజున పితృ తర్పణం, నదులు-సరస్సుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందుతారు
- శ్రమ జీవులైన చీమలకు ఆహారం వేయడం, పశువులు పక్షల దాహం తీర్చడం లాంటివి చేస్తే ఇంకా మంచిది
- కనీసం తలకి స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకుని శనిస్త్రోత్రాలు చదువుకున్నా కొంతవరకూ గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
- అన్నింటికన్నా హనుమాన్ చాలీసా పఠిస్తే అన్నిరకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు.
Also Read: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, ఈ ప్రభావం మీ రాశిపై ఏమేరకు ఉందో తెలుసుకోండి
శని స్త్రోత్రం
నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ ||
నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక ||
నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః ||
నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే ||
నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే ||
సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే ||
నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ ||
జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్ క్షణాత్ ||
దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః |
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే ||
బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః ||
త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః ||
ఇతి శ్రీ దశరథ ప్రోక్త శని స్తోత్రం సంపూర్ణం ||
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు