Zodiac Signs Saturn Rahu 2022 : రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
2022 మార్చిలో రాహువు తిరోగమనం చెందాడు. వృషభ రాశినుంచి మేషరాశిలోకి మారాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కష్టాలు, ఇబ్బందుల సంగతి పక్కనపెడితే ఈ ఐదు రాశులవారికి మాత్రం కష్టాలు తీరి ఆర్థికంగా బలపడతారు
నవగ్రహ సంచారం ఆధారంగా ఆ ఏడాదిలో ఏ రాశివారి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే రాహువు సంచారం గురించి చెప్పుకుంటే...ఛాయా గ్రహంగా పరిగణించే రాహువు మార్చి 17న తన రాశిని మార్చుకుని మేషరాశిలో అడుగుపెట్టాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని తర్వాత రాహువు గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాగే రాహు-కేతువుల గమనం ఎప్పుడూ తిరోగమనం(రివర్స్)గా ఉంటుంది. దాదాపు 18 నెలల పాటూ వృషభరాశిలో సంచరించిన రాహువు ఇప్పుడు మేషరాశిలో ఉన్నాడు. తద్వారా కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలుంటే మరికొన్ని రాశుల వారికి రాహువు తిరోగమనం మంచి ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా ఈ ఐదు రాశులవారికి శుభం, ఐశ్వర్యం.
మిథునం
మిథునరాశి వారికి రాహువు మేషరాశిలో సంచరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ప్రగతికి అడ్డంకులు తొలగిపోతాయి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు. షేర్ మార్కెట్ నుంచి లాభం ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారు లక్ష్యాలను సులభంగా సాధించేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
కర్కాటకం
రాహువు తిరోగమనం ఈ రాశివారికి కూడా ప్రయోజనకరంగా ఉంది. అదృష్టం కలిసొస్తుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు ఇది మంచి సమయమని రుజువు అవుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. గతంలో కన్నా ఆర్థికంగా బలపడతారు.
వృశ్చికం
రాహువు రాశి మార్పు వృశ్చిక రాశికి భలే కలిసొస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పదోన్నతితో పాటూ జీతం పెరగుతుంది. వృత్తిపరమైన సమస్యలు దూరమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. విద్యార్థులు సక్సెస్ అవుతారు.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
కుంభం
మేషరాశిలో రాహువు సంచారం కుంభ రాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఏదో ఒక మూల నుంచి ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. అప్పచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది.
మీనం
రాహువు రాశి మార్పు మీన రాశి వారికి కూడా కలిసొస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలొస్తాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. రాజకీయ నాయకులు లాభపడతారు.
Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా రాసిన ఫలితాలుఇవి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.