Zodiac Signs: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
![Zodiac Signs: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే Zodiac Signs: venus transit 2022 change of zodiac sign of venus the planet of happiness for 7 zodiac signs, Know In Details Zodiac Signs: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/04/a0724e2bfd0fd02a004eef15808a462b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆనందాన్ని, తేజస్సును అందించే శుక్ర గ్రహం 12 రాశులపైనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. 2022 ఏప్రిల్ ఆఖరివారంలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభరాశిలో శుక్రుని సంచారం వల్ల ఈ ఏడు రాశులవారికి శుభప్రదం. ఆ రాశులేంటి చూద్దాం...
మేషం
మేషరాశిలో శుక్రుడు పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే ఆర్థిక పరంగా ఈ రాశివారి బాగా కలిసొస్తుంది. ముఖ్యంగా రవాణా వ్యాపారులకు బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కెరీర్, ఉద్యోగ పరంగా కూడా మంచిచేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
మిథునం
ఈ రాశివారికి శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ మార్పుపై ఆలోచిస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి.వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
సింహం
శుక్రుడు ఈ రాశిలో సప్తమంలో ఉంటాడు.ఈ సంచారం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది.వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు.
Alos Read: శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మీ రాశిఫలితం, కందాయ ఫలం ఇక్కడ తెలుసుకోండి
తుల
తులారాశివారికి శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నాడు. శుక్రుని సంచారం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. సేవ చేసే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి.
వృశ్చికం
శుక్రుడు వృశ్చిక రాశిలోని నాల్గవ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. వ్యాపారంలో మందగమనం దూరమవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశసంలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు.
మకరం
మకరరాశివారికి రెండోఇంట సంచరిస్తున్నాడు శుక్రుడు. వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక మాంద్యం తొలగిపోతుంది. మీరు మంచి సమాచారాన్ని పొందవచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులకు జీతాల పెంపు, ప్రమోషన్ ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. శుభ కార్యాలలో పాల్గొంటారు.
Alos Read: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
కుంభం
శుక్ర సంచారం కుంభ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీ వైవాహిక జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.విద్యార్థులు పరీక్షల్లో సానుకూల ఫలితాలు పొందుతారు.వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది.
మీనం
శుక్రుడి సంచారం వల్ల ఇల్లు లేదా వాహనం కొనుగోలు అవకాశాలను సూచిస్తోంది. ఉద్యోగం చేయాలనే కల నెరవేరుతుంది. కోర్టుకు వెళ్లే ముందు వివాదాలను పరిష్కరించుకోండి. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)