Sri Subhakrit Nama Samvatsaram: శుభకృత్ నామ సంవత్సరంలో నక్షత్రాలావారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే అంతా శూన్యమే
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో కందాయ ఫలాలు గురించి తెలుసుకోండి. మీ నక్షత్రాన్ని ఆధారంగా ఈ ఏడాది ఫలితం తెలుసుకోండి. ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది.
కందాయ ఫలాలు మూడు భాగాలుగా విడగొట్టి చూస్తారు.నాలుగు నెలల చొప్పున డివైడ్ చేస్తారు. అంటే ఈ ఏడాది ఉగాది ఏప్రిల్లో కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు ఓ ఫలితం- ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబరు నెలలకు మరో ఫలితం- డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి,మార్చి నెలలకు మరో ఫలితం చొప్పున విభజిస్తారు.
ఫలితాలు మూడు రకాలుగా ( సరి, బేసి, శూన్య(సున్నా)) ఉంటాయి..వీటినే కందాయ ఫలాలు అంటారు
1. కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ధనలాభం
2. కందాయ ఫలాల్లో సరి సంఖ్య ఉంటే సమఫలం
3. కందాయ ఫలాల్లో సున్నా ఉంటే శూన్య ఫలితం
4. మొదటి ఫలితం సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళను వెంటాడుతాయి
5. మధ్యలో ఫలితం సున్నా ఉంటే బుణబాధలు, అవమానాలు తప్పవు
6. చివర్లో సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం ఉంటుందని అర్థం
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి
ఏ నక్షత్రం కందాయ ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి....
( నక్షత్రం పక్కనే ఇచ్చిన మూడు ఫలితాల్లో ఉన్న సరి, బేసి, సున్నా ఆధారంగా మొదటి నాలుగు నెలలు, రెండో నాలుగు నెలలు, చివరి నాలుగు నెలలు మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోవచ్చు)
నక్షత్రం కందాయ ఫలం
అశ్వని 5 0 1
భరణి 0 1 3
కృత్తిక 3 2 0
రోహిణి 6 0 2
మృగశిర 1 1 4
ఆరుద్ర 4 2 1
పునర్వసు 7 0 3
పుష్యమి 2 1 0
ఆశ్లేష 5 2 2
మఖ 0 0 4
పూర్వఫల్గుణి 3 1 1
ఉత్తరఫల్గుణి 6 2 3
హస్త 1 0 0
చిత్త 4 1 2
స్వాతి 7 2 4
విశాఖ 2 0 1
అనూరాధ 5 1 3
జ్యేష్ట 0 2 0
మూల 3 0 2
పూర్వాషాఢ 6 1 4
ఉత్తరాషాఢ 1 2 1
శ్రవణం 4 0 3
ధనిష్ట 7 1 0
శతభిషం 2 2 2
పూర్వాభాద్ర 5 0 4
ఉత్తరాభాద్ర 0 1 1
రేవతి 3 2 3
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో