Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో (2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకూ) మీ రాశిఫలితాలు
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు )
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5
ఈ సంవత్సరంలో తులారాశివారికి గురుడు ఆరవ స్థానంలో, రాహు కేతువులు సప్తమం, జన్మంలోనూ, శని నాలుగో స్థానంలోనూ ఉన్నందున ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి.ముఖ్యంగా అర్థాష్టమ శని ప్రభావం వల్ల గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వలేడు.సమయస్ఫూర్తి చాలా అవసరం. దేనికీ తొందరవద్దు. ఆత్మీయుల సూచనలతో ఫలితం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండాలి. సహనంతోనే విజయం సాధిస్తారు. విద్యార్థులు చాలా కష్టపడాలి.
వృశ్చికం (విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు )
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1
వృశ్చికరాశివారికి ...ధనం, కుటుంబ కారకుడైన గురుడు 5వ స్థానంలో, శని మూడో స్థానంలో, రాహు కేతువులు6, 12 స్థానాల్లో ఉండటంతో ఈ సంవత్సరం మిగిలిన రాశులవారికన్నా ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. గురు, శని ప్రభావంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తైపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం పెరుగుతుంది. స్వయంకృషితో అభివృద్ధిని సాధించాలి. విశేష భూలాభం, గృహయోగం వస్తు వాహన ప్రాప్తి కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారం బాగా సాగుతుంది. దగ్గరివారితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి
ధనస్సు (మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం )
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1
ధనస్సు రాశివారికి గురుడు చతుర్థంలో, శని ధనస్థానంలో , రాహుకేతువులు 5,11 స్థానాల్లో ఉన్నందున గతేడాది కన్నా పరిస్థితులు అనకూలంగా ఉంటాయి. ఏపని చేసినా సక్సెస్ అవుతారు. ఇంటా-బయటా గౌరవం పొందుతారు. మీ ప్రతిభను అందరూ గుర్తించి సముచితమైన స్థానాన్ని ఇస్తారు. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. గురు, శనుల వల్ల కొన్ని విఘ్నాలు ఎదురవుతాయి.దగ్గరివారితో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరం. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందడుగు వేయండి. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే అధికారుల ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మకరం (ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు )
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
మకరరాశి వారికి ధనం, సంపద, కుటుంబ కారకుడైన గురుడు తృతీయంలో, లగ్నాధిపతి అయిన శని జన్మంలో , రాహు కేతువులు 4,10 స్థానాల్లో ఉండటం వల్ల ఏ పని చేసినా కలసిరాదు. కానీ మనోబలంతో అభీష్టాలు సిద్ధిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలను సాధిస్తారు. శని, గురువు, రాహువుల వల్ల మధ్య మధ్యలో అనేక విఘ్నాలు ఎదురవుతాయి. మంచితనం, దైవబలం మీకు అండగా ఉంటుంది. మొహమాటం వల్ల ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి తెలివిగా బయటపడాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులు ప్రణాళికతో మంచి ఫలితాలను సాధిస్తారు.
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు)
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
ధనం, కుటుంబ కారకుడైన గురుడు ధనస్థానంలో ఉన్నాడు, శని జన్మంలో ఉండగా రాహు, కేతువులు 3,9 స్థానాల్లో ఉన్నాయి.అంటే గ్రహస్థితి అనుకూలంగా ఉంది.ఈ రాశివారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ అంత ఇబ్బందిపెట్టదు. గతేడాదికన్నా చాలా బావుంటుంది.ధన సౌఖ్యం, యశోవృద్ధి కలుగుతాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారులకు విశేషమైన శుభాలున్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.విఘ్నాలు తొలగుతాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి.
మీనం (పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7
ఈ ఏడాది ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి.ఆదాయం తక్కువ- ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ధనం ఏదోవిధంగా చేతికందుతుంది. మొహమాటానికి పోకుండా ఖర్చులు తగ్గించండి. చేసిన అప్పులు కొంతవరకూ తీర్చగలుగుతారు గృహ నిర్మాణాది ప్రయత్నాలు విజయాన్నిస్తాయి. మనోధైర్యంతో ముందుకుసాగితే అంతా మంచే జరుగుతుంది. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది, పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.గృహజీవితంలో ఆనందం ఉంటుంది, కొన్ని సమస్యల విషయంలో రాజీపడడం మంచిది. వీరికి గ్రహబలం అస్సలు లేదు. మీ శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు పెద్దగా పనిచేయవు... మనోధైర్యంతో ముందుకు సాగండి.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో