Sri Subhakrit Nama Samvatsaram: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి
ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ, వ్యయాలు...అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో (2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకూ) మీ రాశిఫలితాలు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం )
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 6
మేషరాశివారికి ఈ ఏడాదంతా మిశ్రమ ఫలితాలుంటాయి. అంటే మంచి-చెడు, జపం-అపజయం అన్నీ సమానంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలను మాత్రం సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలున్నాయి.కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు కలిసొస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడండి. పరిస్థితిని అంచనా వేస్తూ మిమ్మల్ని మీరు మార్చుకుంటూ ముందుకుసాగాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులొస్తాయి. ఓర్పు చాలా అవసరం. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భార్య-భర్త మధ్య అన్యోన్యత తగ్గుతుంది. ఆరోగ్యాన్ని, ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకుండా మీపని మీరు చేసుకుంటూ వెళితే అనుకూల ఫలితాలుసాధించే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు)
ఆదాయం : 8, వ్యయం : 8 ,రాజ్యపూజ్యం : 6, అవమానం : 6
శుభకృత్ నామసంవత్సరంలో వృషభరాశివారికి అధ్భుతంగా ఉంది. ఈ ఏడాది వీరిపై గురుబలం అధికంగా ఉండడంతో అన్నింటిలోనూ పైచేయి సాధిస్తారు. అదృష్టం మీకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, శత్రువులపై విజయం సాధిస్తారు. దైవనానుగ్రహం మీపై ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. 12లో రాహువు వల్ల తెలియని ఖర్చులూ ఇబ్బందులూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులూ ఎదురవొచ్చు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు )
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2
మిథున రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవానికి కారకుడైన గురుడు 10 వ స్థానంలో ఉన్నాడు. రాహువు 11 స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో ఉన్నప్పటికీ..అంటే అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు.పెద్దహోదాగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అధికారం వహించే శక్తిసామర్థ్యాలు వీరిసొంతం.గురు, శని, కేతు దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా పనుల్ని పూర్తిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో శాంతం అవసరం. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.
కర్కాటకం (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
ఈ రాశి వారికి గురుడు మీనరాశిలో ఉండటం వల్ల చాలా యోగదాయకంగా ఉంటుంది. శని సప్తమంలో, రాహుకేతువులు 10,4 స్థానాల్లో ఉండటం వల్ల ఈ ఉగాది నుంచి మీకు అంతా శుభసమయమే. రాజకీయంగా, సాంఘికంగా , ఇంటా-బయటా గౌరవ మర్యాదలు దక్కుతాయి. వ్యాపారం కలిసొస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీరు ఎదురుచూస్తున్న విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శని, కేతువుల వల్ల మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఉండాలి.
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం )
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5
సింహరాశివారికి గురుడు అష్టమంలో, రాహువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల శుభాశుభాలు మిశ్రమంగా ఉన్నాయి. పట్టుదలతో శ్రమిస్తే విజయం సాధిస్తారు. ఈ ఏడాది కాలంలో మీరు సాధించే ప్రతి విజయం మీ స్వయంకృషి వల్ల మాత్రమే అని తెలుసుకోండి. ఆర్థికస్థితి క్రమంగా మెరుగవుతుంది. సాహసోపేత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ముందుకుసాగండి. ఉద్యోగులకు అత్యద్భుతంగా ఉంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులూ రావు.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5
శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కన్యరాశి వారికి గురుడు సప్తమంలో, శని ఐదవ స్థానంలో, రాహువు అష్టమంలో ఉండటం వల్ల గడిచిన ఏడాది కన్నా ఈ ఏడాది శుభఫలితాలున్నాయి.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సంఘంలో గౌరవం-పలుకుబడి పెరుగుతాయి. ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు.అప్పుడప్పుడూ తెలియని ఆటంకాలెదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. వ్యాపారులకు ఏడాదంతా శుభసమయమే. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది.కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో