Zodiac Signs Saturn 2022: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
2022 ఏప్రిల్ 29న శని మకర రాశి నుంచి రెండేళ్ల మూడు నెలల వ్యవధి తర్వాత కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రభావం ఏడాదిపొడవునా అన్నిరాశులపై ఉంటుంది. కొన్ని రాశులవారికి అయితే రాజయోగమే...
2022 శుభకృత్ నామ సంవత్సరానికి శని రాజు కాగా...బృహస్పతి(గురుడు) మంత్రి స్థానంలో ఉన్నాడు. నూతన సంవత్సరం ప్రారంభం కానుండడంతో ఒక్కో గ్రహం తమ రాశులు మారుతాయి. దాదాపు రెండున్నరేళ్లుగా మకర రాశిలో ఉన్న శని...ఏప్రిల్ 29న రాశిమారుతోంది. శనిసంచారం కొన్ని రాశులవారిని అందలం ఎక్కిస్తుంది. ఆ రాశులేంటో చూద్దాం.
శనిగ్రహం శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని, చెడు స్థానంలో చెడు ఫలితాన్ని కలగజేస్తాడు. అందుకే శని గ్రహ సంచారం మారిందనగానే కొన్ని రాశుల వారు హమ్మయ్య అనుకుంటే ఇంకొందరు అమ్మో అనుకుంటారు. సాధారణంగా శని 3, 6, 7, 10 స్థానాల్లో ఉంటే మంచిదని చెబుతారు. మరి శుభకృత్ నామసంవత్సరంలో శని ప్రభావం ఎవరికి యోగాన్నిస్తుందో చూద్దాం.
మేషం
ఈ రాశివారికి శని కుంభరాశిలోకి మారడం అదృష్టాన్ని, శ్రేయస్సును కలిగిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగుల జీతంలో పెరుగుదల ఉంటుంది. ఫ్రెషర్‌లకు మంచి ఉద్యోగం లభిస్తుంది. సొంతంగా ఏదైనా ప్రారంభించాలనుకునేవారికి మంచిరోజు.
వృషభం
వృషభ రాశి వారికి శని తన స్థానాన్ని మార్చుకోవడం వల్ల యోగం పట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 29వ తేదీన వృషభ రాశి వారికి దశమంలోకి శని రావడంతో వారి దశ మారనుంది. వీరు ఆర్థికంగా పురోగతిని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారం, ఉద్యోగ విషయాల్లో కూడా వీరు ఊహించని ఫలితాలు పొందుతారు.
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు
మిథునం
కుంభరాశిలో శని సంచరించిన వెంటనే మిథున రాశి వారికి అష్టమ శని బాధనుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అప్పటి వరకూ ఎదుర్కొన్న సమస్యలు ఒక్కొక్కటీ తొలగి ప్రశాంతత లభిస్తుంది. రెండేళ్లుగా పెండింగ్ పడుతూ వస్తున్న పనుల్లో కదలిక వస్తుంది. ఈ టైమ్ లో మీరు ప్రశాంతంగా , ఓపికగా ఉంటారు. ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది.
సింహం
ఈ రాశి వారికి కూడా శని గ్రహం అనుగ్రహం ఉంటుంది. వీరికి సప్తమ శని వల్ల యోగం సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి జీవితాల్లో మార్పులతో పాటు ఆర్థిక ప్రగతి కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులు ఊహించని ఫలితాలొస్తాయి. ఈ రాశిలో వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.
కన్యా
ఈ రాశి వారికి శని సంచారం ఆరు స్థానంలో ఉంటుంది. అంటే వీరికి కూడా గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది. అప్పుల బాధలు తీరుతాయి. ఊహించని విజయాలు అందుకుంటారు .
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
ధనస్సు
ఈ రాశి వారికి శని సంచారం వల్ల గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. ఏవైనా సమస్యలున్నా అవి వీరిపై పెద్దగా ప్రభావం చూపవు. విద్యార్థులు, ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఏలినాటి శని ముగిసిపోవడంతో ఊహించనంత ఉపశమనం పొందుతారు.
శని గ్రహం ఒక్కో ఇంట్లో రెండున్నరేళ్లు ఉంటాడు. అంటే కుంభంలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత తన గమనాన్ని మార్చుకుంటాడు. అంటే మొత్తం 12 రాశుల్ని శని చుట్టి మళ్లీ ఇప్పుడు స్థానానికి రావాలంటే 30 ఏళ్లు పడుతుంది. మరోముఖ్య విషయం ఏంటంటే పైన చెప్పిన రాశులవారికి శని అనుకూలంగా ఉందంటే..మిగిలిన రాశులవారికి అస్సలు బాగాలేదని కాదు మిగలిన గ్రహాలున్న స్థానం బట్టి శని ప్రభావం ఉంటుంది. గురుడు, శుక్రుడు మంచి స్థానంలో ఉన్నరాశులకు కూడా శనిప్రభావం తక్కువ ఉంటుంది.
కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా రాసిన ఫలితాలుఇవి. వీటిని ఎంతవరకూ విశ్వశించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.