By: ABP Desam | Updated at : 18 Apr 2022 06:36 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఏప్రిల్ 18 నుంచి 24 వరకూ వార ఫలాలు
ఏప్రిల్ 18 సోమవారం నుంచి 24 ఆదివారం వరకూ వారఫలాలు
మేషం
మేషరాశివారు ఈ వారం విశ్రాంతితో పాటు డైట్, వ్యాయామంపై కూడా శ్రద్ధ పెట్టాలి. కళాత్మక మరియు ఆసక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వివాదాలు స్వల్ప ప్రయత్నాలతో పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారం బావుంటుంది. మీ బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించండి.
వృషభం
వ్యాపార లక్ష్యాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. బద్దకాన్ని వీడండి. ఈ వారం చివర్లో శుభవార్తలు వింటారు. మనసులో ఉన్న కొన్ని దీర్ఘకాల ఆలోచనలు ఓ కొలిక్కి వస్తాయి. అదృష్టం కలిసొస్తుంది.
మిథునం
కష్టపడి పని చేస్తేనే విజయం సాధించగలుగుతారు. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ప్రతిష్టను పొందుతారు. వ్యక్తిగత సంబంధాల్లో ప్రేమ పెరుగుతుంది. భోజనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం మానుకోండి. ఎవరిపైనా పగ పెంచుకోవద్దు. విద్యార్థులు విజయం సాధిస్తారు.
Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
కర్కాటకం
మీరు మీ లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. సులభమైన విధానాన్ని అవలంబించడం ద్వారా, ప్రణాళికలను అమలు చేయడం సులభం అవుతుంది. కఠోర శ్రమతో మీ లక్ష్యాలను సాధించవచ్చు. సహనం, పట్టుదలతోనే సక్సెస్ అని గుర్తించండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం
మీరు కార్యాలయంలో కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ప్రేమ, కోపం త్వరగా వ్యక్తం చేసేతీరుని మార్చుకోండి. కాస్త లోతుగా ఆలోచిస్తే మీ మనసులో ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. యోగా, ధ్యానంపై దృష్టిపెట్టండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో కొత్త అనుభవాలుంటాయి. ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.
కన్య
ఆఫీసు వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ సంపద పెరుగుతుంది. ఓర్పు, నిరంతర ప్రయత్నం విజయాన్ని అందిస్తాయి. పురోగతి ఉంటుంది. పాత వివాదానికి తెరపడుతుంది. ఆత్మగౌరవం బలంగా ఉంటుంది. కొత్తగా ఏమైనా ప్రారంభించాలి అనుకుంటే పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోండి. బంధువులు వస్తారు.
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు
తుల
ముఖ్యమైన పనులు పక్కనపెట్టేస్తారు. ప్రయత్నాలలో నిలకడ లేకపోవడం సమస్యలకు దారి తీస్తుంది. ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకు కలిసొచ్చే సమయమే. వృత్తిలో పురోగతి ఉంటుంది. కార్యాలయంలో, వ్యకిగత సంబంధాల్లో చిన్న చిన్న సమస్యలుంటాయి. మీ మనసుల మాట వ్యక్తం చేయండి. ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. పూర్వ మిత్రులను కలుస్తారు. టెన్షన్ పోతుంది.
వృశ్చికం
వ్యాపారం బాగా సాగుతుంది. తలపెట్టిన పనులు సులభంగా పూర్తి చేస్తారు.రాజకీయ వ్యక్తులతో సంప్రదింపులు చేస్తారు. సానుకూల దృక్పథంతో వృత్తి జీవితంలో స్థిరత్వం తీసుకొస్తారు. దాంపత్య సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. బంధువులను కలుస్తారు. నిలుపుదల చేసిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. కెరీర్‌కు సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. ధనం లాభదాయకంగా ఉంటుంది.
ధనుస్సు
ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ దినచర్యలో మార్పు ఉంటుంది. ఆఫీసులో సహోద్యోగులతో వాగ్వాదాలు జరగవచ్చు. విహారయాత్రకు వెళ్తారు సానుకూల దృక్పథం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో విశేషమైన మార్పులను తెస్తుంది. జీవితంలో సామరస్యం ఉంటుంది. స్వీయ అధ్యయనం ఆసక్తి కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
మకరం
జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండండి. పిల్లలతో గడుపుతారు. మీ సంపద పెరుగుతుంది. మీ ఆకట్టుకునే వ్యక్తిత్వం ప్రజలను ఆకర్షిస్తుంది. వ్యక్తిగత సంబంధాలను విశ్లేషించడానికి బదులుగా, మీ మనుసు చెప్పింది ఫాలో అవండి. కొత్త ఆలోచనలు చేస్తారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
కుంభం
ఈ రాశి వారు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీరు ప్రకృతి మధ్య విశ్రాంతి మరియు సమయం గడపాలి. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం. వారాంతంలో కార్యాలయ పరిస్థితులు, వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోండి.
మీనం
మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ సంపద పెరుగుతుంది. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి. వృత్తి జీవితంలో పోటీతత్వం పెరుగుతుంది. మీ నైపుణ్యానికి ప్రశంసలు అందుతాయి. సామాజిక జీవితం బిజీగా ఉంటుంది. ఎదుటివారిని చులకనగా చూడడం వల్ల మీరే నష్టపోతారు.
Gyanvapi Masjid: 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!
Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే
Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
YSRCP Rajya Sabha: తెలంగాణ వ్యక్తుల్ని రాజ్యసభ పదవుల నుంచి తొలగించండి - సీఎం జగన్‌కు ఏపీ నిరుద్యోగ జేఏసీ నిరసన సెగ