Solar Eclipse 2022 Impact on zodiac signs: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, ఈ ప్రభావం మీ రాశిపై ఏమేరకు ఉందో తెలుసుకోండి
ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022న ఏర్పడుతుంది. ఏప్రిల్ 30 సూర్యగ్రహణం - మధ్యాహ్నం 12.15 నుంచి సాయంత్రం 4.07 వరకు. ఈ ప్రభావం ఏ రాశివారిపై ఎలా ఉంటుందంటే...
ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న ఏర్పడనుంది. గ్రహణాల్ని అశుభంగా భావించే హిందువులు ఆ సమయంలో ప్రత్యేక పూజలు, పరిహారాలు చేసుకుంటారు. మన దేశంలో సూర్యగ్రహం ఏప్రిల్ 30 మధ్యహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఇండియాలో ఈ తొలి సూర్యగ్రహణం పాక్షికంగా ఉంటుంది. పూర్తిగా కన్పించేది మాత్రం దక్షిణ, పశ్చిమ అమెరికా, పసిఫిక్ అట్లాంటిక్, అంటార్కిటికా ప్రాంతాలున్నాయి. స్పష్టంగా చెప్పాలంటే సూర్య గ్రహణం తెలుగు రాష్ట్రాలకు కాదు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే. అయినప్పటికీ గ్రహణం రోజు గ్రహాల గమనం ఆధారంగా కొన్ని రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది.
ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంది
మేషం
మేషం రాశి వారు సూర్యగ్రహణం సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా గ్రహణం రోజు ఆర్థిక లావాదేవీలు జరిపితే తీవ్రంగా నష్టపోతారు. రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఎవ్వరికీ చెప్పొద్దు.
వృషభం
వృషభ రాశి వారు గ్రహణం రోజు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. వీరిపై ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి.
మిథునం
మిథున రాశి వారు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులు చురుకుగా ఉండగలరు. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను గమనిస్తూ ఉండండి.
కర్కాటకం
ఈ గ్రహణం కర్కాటక రాశి వారికి మంచిదని రుజువు చేస్తుంది. సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.
సింహం
ఈ వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే గ్రహణ సమయంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉండండి.విద్యార్థులకు ఆనందకరమైన సమాచారం అందుతుంది.
కన్య
కష్టపడి పని చేస్తేనే విజయం లభిస్తుంది. సూర్యగ్రహణం సమయంలో వచ్చే ఆలోచనలను పట్టించుకోకండి. ఉద్యోగ మారేందుకు ప్రయత్నించవద్దు. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
తులా
తులారాశి వారికి సూర్యగ్రహణం ప్రభావం ఆహ్లాదకరంగా ఉండదు. ఆరోగ్యం క్షీణించవచ్చు. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ పెద్ద స్వరంతో మాట్లాడకండి.
ధనుస్సు
సూర్యగ్రహణం ధనుస్సు రాశికి మంచిది. ఈ రోజు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. మ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. టెన్షన్ తగ్గుతుంది. ఎక్కువ ఖర్చు చేయడం మానుకోండి.
మకరం
ఈ రాశి వారిలో క్లారిటీ మిస్సై బాధపడతారు. డ్రగ్స్, జూదం వంటి వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు.
కుంభం
స్టాక్ మార్కెట్ లో నష్టాలు రావచ్చు. ఇంట్లో ఎవరితోనైనా గొడవలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని పనుల్లో నష్టాలు సంభవించవచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మీనం
ఈ సూర్యగ్రహణం మీనరాశి వారికి మేలు చేస్తుంది. మీరు సామాజికంగా గౌరవం పొందుతారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు.
Also Read: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే