![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Zodiac Signs Jupiter Transit 2022: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు
Jupiter Transit 2022: ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా గురు గ్రహం అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందుతామని చెబుతారు. ఏప్రిల్ 13 నుంచి గురుగ్రహం రాశిమారింది. గురుడు మార్పు ఈ రాశులవారికి అధ్భుతంగా ఉంది
![Zodiac Signs Jupiter Transit 2022: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు Zodiac Signs Jupiter Transit 2022: Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Zodiac Signs Jupiter Transit 2022: మీన రాశిలో గురు గ్రహం సంచారం వల్ల ఈ ఐదు రాశువారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/5511abde33183639c823701e82c23530_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏప్రిల్ 13, 2022న బృహస్పతి ( దేవతల గురువు) రాశి మారింది. ప్రస్తుతం తన సొంత రాశి అయిన మీనంలో సంచరిస్తున్నాడు. బృహస్పతి మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడితే మరికొన్ని రాశులవారికి ఇబ్బందులు మూటగట్టుకువస్తుంది. ఏప్రిల్ 13 నుంచి దాదాపు 13 నెలల పాటూ మీన రాశిలో సంచరిస్తాడు గురుడు. దీంతో మీ రాశిలో 2వ, 5వ, 9వ, 12వ స్థానంలో గురుడు సంచరిస్తే శుభఫలితాలు ఉంటాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పెద్ద గ్రహాల్లో ఒకటిగా చెప్పే బృహస్పతి మంచి స్థానంలో ఉంటే విద్య, ఉద్యోగంలో ఉన్నతస్థానం, వివాహం, పిల్లలు, దాంపత్యానికి సంబంధించి శుభఫలితాలు ఇస్తుంది. ఇంతకీ గురుగ్రహం వల్ల ఏఏ రాశులవారికి మంచి జరుగుతుందంటే..
మేషం
ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి బృహస్పతి మేష రాశిలో 12వ ఇంట సంచరిస్తున్నాడు. అందుకే ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. పూర్వీకుల ఆస్తినుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వివాహం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు
కర్కాటకం
కర్కాటక రాశివారికి గురు గ్రహం తొమ్మిదో ఇంట సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి ఈ కాలం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆస్తి పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార-ఉద్యోగాల్లో లాభం ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయవద్దు.
వృశ్చికం
ఈ రాశి వారికి బృహస్పతి ఐదవ ఇంట సంచరిస్తాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. అన్నింటా పురోగతి ఉంటుంది.
Also Read: ఈ వారం ఈ రాశులవారు లక్ష్యాలను సులభంగా సాధించేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
కుంభం
ఈ రాశిలో గురుడు రెండవ ఇంట సంచరిస్తున్నాడు. ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి, పదోన్నతులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు సక్సెస్ మిమ్మల్ని మరింత ఆనందంగా ఉంచుతుంది. ఆస్తి కలిసొస్తుంది.
మీనం
మీన రాశివారికి బృహస్పతి లగ్నంలో సంచరిస్తున్నాడు.దీనివల్ల మీపై అందరికి విశ్వాసం పెరుగుతుంది, వ్యాపారంలో విజయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది.
Also Read:శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)