Muharram 2025 Date:మొహర్రం ఎప్పుడొచ్చింది , ఈ పండుగ ప్రత్యేకతలేంటి , ఈ నెలలో ముస్లింలు శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు!
Muharram 2025: ఈ ఏడాది మొహర్రం ఎప్పుడొచ్చింది , ఈ పండుగ ప్రత్యేకతలేంటి , ఈ నెలలో ముస్లింలు శుభకార్యాలు ఎందుకు నిర్వహించరు.. పూర్తి వివాలు ఇక్కడ తెలుసుకోండి!

Muharram 2025 Date: 2025లో మెహర్రం జూన్ 27 శుక్రవారం ప్రారంభమవుతుంది. నెలవంక కనిపించిన ప్రకారం వివిధ దేశాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి. ఈ నెలలో పదో రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్లో మొహర్రం ఫస్ట్ మంత్ , ఇది న్యూ ఇయర్ ప్రారంభాన్ని సూచిస్తుంది.
తెలుగు సంవత్సరం చైత్రమాసం పాడ్యమి నుంచి ప్రారంభమై.. ఫాల్గుణమాస అమావాస్యతో పూర్తవుతుంది
ఇంగ్లీష్ సంవత్సవం జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఉంటుంది
అలాగే..
ఇస్లామిక్ క్యాలెండర్ కూడా ఉంటుంది..అయితే ఇందులో 365 రోజులు కాకుండా 354 రోజులు మాత్రమే ఉంటాయి
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సర ఆరంభం మొహర్రం నుంచే. ఈనెలలో ముస్లింలు ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరు. ఇమామ్ హుస్సేన్, ఆయన అనుచరుల కోసం సంతాపదినాలు పాటిస్తారు. ఉపవాసం ఉంటారు. ప్రవక్త జీవితం గురించి బోధనల గురించి తెలుసుకుంటారు.
మహ్మద్ ప్రవక్త మరణం తర్వాత హజరత్ అబూబకర్ సిద్ధీఖ్, హజరత్ అలీ, హజరత్ ఉమర్ మంచి పాలన అందించారు. కానీ వీరి తర్వాత వచ్చి మావియా చక్రవర్తి ప్రజల్ని హింసించి ఆనందం పొందేవాడు. ఆ తర్వాత యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించుకుని క్రూరంగా పాలన సాగించాడు. ఆ సమయంలో హజరత్ హుసేన్ ప్రజల తరపున పోరాటం చేశాడు. శాంతికోసం హజరత్ చేసిన ప్రతిపాదన తిరస్కరించాడు యజీద్. పైగా యుద్ధం ప్రకటించాడు.
మొహర్రం నెలలో మొదటి రోజు ఇరాక్ కర్బలా మైదానంలో యుద్ధం ఆరంభమైంది. ఇందులో యజీద్ సైన్యం హుసేన్ తో పాటు కుటుంబసభ్యులను, మహిళలను, పసిపిల్లల్ని సైతం దారుణంగా హతమార్చారు. మొహర్రం నెల ఆరంభమైనప్పటి నుంచి పదో రోజున అల్లాహ్‌ను స్మరించుకుంటూ నమాజ్ చేస్తున్న ఇమాం హుసేన్‌ను శత్రువులు చుట్టుముట్టారు. ఈ దాడిలోమహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన దాదాపు డబ్భై మంది వరకు అమరులయ్యారు. ఈ సమయంలోనే హజరత్ హుసేన్ ఆ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని ప్రార్థిస్తూ శాపం పెట్టి ప్రాణం విడిచాడు. యుద్ధం పూర్తైన తర్వాత యాజిద్ తెగవారు పశ్చాత్తాపం చెంది తమకు మోక్షం ప్రసాదించమని కోరుతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కణకణమండే నిప్పులపై పాదాలకు చెప్పుల్లేకుండా నడిచారు. ఆ ఆచారం ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనసాగుతోంది.
మహ్మద్ ప్రవక్త కుటుంబానికి చెందిన వారంతా..అమరులైన తమ పెద్దల్ని తలుచుకుంటూ రెండు రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తారు. ఈ నెల రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
తెలుగు రాష్ట్రాల్లో మొహర్రం వేడుకలను పది రోజుల పాటూ జరుపుకుంటారు. పదో రోజును ఆషురా దినంగా పాటిస్తారు. అంతకు ముందు రోజు ఉపవాస దీక్ష చేపడతారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది హిందువులు కూడా ముస్లింలతో కలసి పీర్ల పండుగను జరుపుకుంటారు. పీర్ అంటే మహాత్ముడు, ధర్మ దేశికుడు అని అర్థం. నిజాం పాలించిన ప్రాంతాల్లోనూ మొహర్రం పండుగను ముస్లింలతో పాటూ అంతా కలసి జరుపుకుంటారు.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
అత్యాచార బాధితురాలి శాపమే ఇరాన్ ని పట్టిపీడిస్తోందా? రెండు దశాబ్దాల క్రితం ఏం జరిగింది? కర్మ ఫలం అంటే ఇదేనా!.. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.






















