Garuda purana: అదృష్టాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని పెంచే అలవాట్లు ఇవి - గరుడ పురాణం చెప్పిన ముఖ్యమైన విషయాలివే!
Garuda Purana Teachings: గరుడ పురాణం హిందూ ధర్మ బోధనలో అత్యంత ముఖ్యమైనది . ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శకం, ధర్మం, కర్మ, మోక్షం గురించి వివరిస్తుంది.

Garuda Purana Teachings: హిందూ ధర్మంలో గరుడ పురాణం ముఖ్యమైన పురాణం. వేదాల తర్వాత హిందూ ధర్మంలో అత్యంత ప్రధానమైనది గరుడ పురాణం. ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక జ్ఞానం అందిస్తుంది గరుడ పురాణం. శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలివి.
గరుడ పురాణం మరణానంతరం సద్గతిని అందించేదిగా పరిగణిస్తారు. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తన కర్మల ఫలాలను ఈ జీవితంలోనే కాకుండా మరణానంతరం కూడా అనుభవించాలి. బతికి ఉన్నప్పుడు చేసే కర్మల ప్రభావం మరణానంతరం ఎలా ఉంటుందో వివరంగా ఉంటుంది ఇందులో.
ఇందులో కేవలం ఆత్మ ప్రయాణం గురించి మాత్రమే కాదు ధర్మం, ఆధ్యాత్మికత, మోక్షం, జీవిత మార్గం, జీవుల కర్మలు వాటి ఫలితాల గురించి విస్తృతంగా ఉంటుంది. ఇందులో జీవిత రహస్యం దాగి ఉంది. ఎవరైనా మరణించిన తర్వాత ఆ ఇంట్లో గరుడ పురాణం పారాయణం చేస్తే ఆత్మకు ఈ ప్రపంచం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు.
గరుడ పురాణం ఒకవైపు మరణానంతర పరిస్థితులు , కర్మల ప్రకారం లభించే ఫలితాల గురించి చెబుతుంది, మరోవైపు నీతి మరియు నియమాలను బోధించడం ద్వారా ప్రజలను మంచి మరియు ధర్మ మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తుంది.
గరుడ పురాణంలో ఒక వ్యక్తి అనేక కష్టాల నుండి తప్పించుకోవడానికి పాటించవలసిన అనేక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క కొన్ని అలవాట్లు అదృష్టాన్ని , జ్ఞానాన్ని దూరం చేస్తాయి..అనారోగ్యం పెంచుతాయి, శత్రువులు చుట్టుముట్టేలా చేస్తాయి. అవేంటంటే...
1. శ్రీ మహాలక్ష్మిని అదృష్టానికి, సంపదకు అధిదేవతగా పూజిస్తారు. శ్రీ మహాలక్ష్మికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. సంపన్నులైనప్పటికీ మురికి బట్టలు ధరించే వారిపై లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. ఇంట్లో పరిశుభ్రత పాటించని, శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోని వారికి అదృష్టాన్ని దరిచేరనివ్వదు లక్ష్మీదేవి. అలాంటి వ్యక్తులు సమాజంలో గౌరవం పొందలేరు ...వారి సంపద క్రమంగా నాశనం అవుతుంది.
2. గరుడ పురాణం ప్రకారం ఓ వ్యక్తి నిరంతరం అలుపెరగక ప్రయత్నిస్తే ఏపనిలో అయినా నైపుణ్యం సాధిస్తాడు. అదే సమయంలో, అభ్యాసం మానేసిన వారు కష్టపడి నేర్చుకున్న విద్యను కూడా మరచిపోవచ్చు. అభ్యాసం చేయకపోవడం వల్ల ప్రజలు తమ జ్ఞానాన్ని కోల్పోతారు.
3. గరుడ పురాణం ప్రకారం ఈ సమాజంలో చెడ్డ వ్యక్తుల మధ్య సురక్షితంగా ఉండాలంటే మీరు తెలివిగా ఉండాలి. సమాజంలో మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి చాలా మంది శత్రువులు ఉన్నారు. వారిని నెట్టుకుని ముందుకు సాగాలంటే మీరు తెలివిగా ప్రవర్తించకపోతే, మీరు నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారికి మీరు హానిచేయాల్సిన అవసరం లేదు.. వారు చేయాలి అనుకున్న హానిని తిప్పికొడితే చాలు. ఆ కళ మీరు అలవర్చుకోవాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఆధ్యాత్మిక గ్రంధాలు, ఆధ్యాత్మిక వేత్తలు సూచించిన వివరాల ఆధారంగా రాసినది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.
జగన్నాథ రథయాత్ర వెనుక రహస్యం.. సగం చెక్కిన విగ్రహాల కథ, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఇది...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















