అన్వేషించండి
కలలో ఈ 7 జంతువులను చూస్తే అదృష్టం కలిసొస్తుంది!
Swapna Shastra: స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కొన్ని జంతువులు కనిపిస్తే అదృష్టం కలిసొస్తుందంటారు.. ఆ జంతువులేంటో తెలుసుకోండి
Meaning of seeing animals in dreams
1/7

ఏనుగులు స్వప్నంలో కనిపించడం చాలా శుభసూచకంగా భావిస్తారు. ఏనుగు బలం, శ్రేయస్సు, దేవుని ఆశీర్వాదాలను సూచిస్తుంది. స్వప్నంలో ఏనుగు కనిపించడం ఆధ్యాత్మిక మార్గదర్శకుల ఉనికి అంతర్గత శక్తికి సంకేతం.
2/7

హిందూ ధర్మంలో ఆవును తల్లిగా భావిస్తారు. ఇది పవిత్రమైన జంతువుగా పూజిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవును చూడటం దేవుని ఆశీర్వాదం, రక్షణ , ఇతరులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది.
3/7

కోతులను.. ఆకతాయి, చురుకుదనం , భక్తితో ముడిపడి చూస్తారు. కోతులను కలలలో చూడటం అనేక అర్థాలను కలిగి ఉంటుంది. ఇందులో సరదా అన్వేషణ, ఏ పరిస్థితులలోనైనా తమను తాము మార్చుకునే సామర్థ్యం .. కోతులు హనుమంతుని ఉనికికి సంకేతంగా కూడా పరిగణిస్తారు. ఇవి జీవితంలో మార్గదర్శకత్వం , రక్షణను అందిస్తాయి.
4/7

సింహం బలం, ధైర్యం , రాజరికంతో ముడిపడి ఉంది, దేవుని అపరిమిత శక్తి మరియు రక్షణకు చిహ్నంగా పరిగణిస్తారు. కలలో సింహం కనిపించడం సవాళ్లను అధిగమించడంతో పాటు నాయకత్వం వహించడం .. మీ సొంత శక్తిని గుర్తించడం వంటి వాటిని సూచిస్తుంది.
5/7

కలలో పక్షులు కనిపించడం స్వేచ్ఛ.. దేవుని మార్గదర్శకత్వం పొందడమని అర్థం. ఇది ఆధ్యాత్మిక సందేశంతో పాటు ఆందోళనల నుంచి బయటపడటానికి సంకేతంగా కూడా పరిగణిస్తారు. హిందూ మతంలో పక్షులను దేవుని దూతలుగా భావిస్తారు.
6/7

కలలో చేప కనిపించడం శుభప్రదం...అదృష్టం కలసివస్తుందని ..చేపట్టిన పనులన్నీ పూర్తవుతాయని అర్థం
7/7

నెమలిని అందం, దయ , ఆధ్యాత్మికతతో ముడిపెట్టి చూస్తారు, ఇది ప్రధానంగా దైవిక రక్షణ , శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. కలలో నెమలి కనిపిస్తే సృజనాత్మకత, జ్ఞానం, ఆశీర్వాదం , సరస్వతి అనుగ్రహానికి సంకేతంగా భావిస్తారు
Published at : 09 Dec 2025 10:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















