అన్వేషించండి

Jagannath Rath Yatra 2025 : పూరీ జగన్నాథ రథయాత్ర పూర్తి షెడ్యూల్ ..ఆ 10 రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందంటే!

Jagannath Rath Yatra 2025 Schedule: పూరీ జగన్నాథుడి రథయాత్రకు ముందు, సమయంలో ఆ పది రోజుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో తెలుసా...

Jagannath Rath Yatra 2025: పూరి జగన్నాథ్ రథయాత్ర కళ్లారా  చూసి తరించేందుకు, రథం వెంట నడిచేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ రథయాత్రలో పాల్గొంటే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు. రథయాత్రలో పాల్గొని జగన్నాథుని నామస్మరణ చేస్తూ గుండిచా  వరకు వెళ్ళేవారికి పునర్జన్మ ఉండదని స్కాంద పురాణంలో ఉంది. 
 
పూరి జగన్నాథ్ రథయాత్ర ఏటా ఆషాఢమాసం ఆరంభంలో ప్రారంభమవుతుంది. 2025లో జూన్ 27న రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది రథయాత్ పూర్తి షెడ్యూల్ ఇదే
 
జగన్నాథ్ రథయాత్ర 2025  షెడ్యూల్ (Jagannath Rath Yatra 2025)

10 జూన్ 2025 

జ్యేష్ఠ పౌర్ణమి రోజు జగన్నాథునికి సహస్రస్నానం జరిగింది. ఈ తర్వాత 15 రోజుల జగన్నాథుడు అనారోగ్యానికి గురవుతారు

16 జూన్ 2025 

అనసరి పంచమి రోజున భగవంతుని అవయవాలకు ఆయుర్వేద ప్రత్యేక నూనెతో మసాజ్ చేస్తారు. దీనిని ఫుల్లరి నూనె అంటారు. ఇది భగవంతుని చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఈ నూనె రాసిన తర్వాత జగన్నాథుడికి నెమ్మదిగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.

20 జూన్ 2025 

అనసరి దశమి రోజున జగన్నాథుడు రత్న సింహాసనంపై కొలువుదీరుతారు.

21 జూన్ 2025 

జగన్నాథుని చికిత్స కోసం  మళ్లీ ప్రత్యేక ఔషధాలను పూస్తారు, దీనిని ఖలి లాగి అని పిలుస్తారు.

25 జూన్ 2025 

బలభద్ర, సుభద్ర , జగన్నాథుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

26 జూన్ 2025

ఈ రోజు జగన్నాథస్వామి నవ యవ్వన దర్శనం లభిస్తుంది. ఈ రోజున రథయాత్ర కోసం ఆయన నుంచి అనుమతి తీసుకుంటారు
 
27 జూన్ 2025 

ఈ రోజు గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథయాత్ర ప్రారంభమవుతుంది. యాత్ర మొదటి రోజున అత్యంత ప్రసిద్ధమైన ఆచారం ఛెరా పహ్రా. ఇందులో ఒడిశా మహారాజు గజపతి బంగారు చీపురుతో రథాల ముందు శుభ్రం చేస్తారు. ఆ తర్వాత రథాన్ని ముందుకు లాగుతారు

1 జూలై 2025 హేరా పంచమి

 'హేరా' అంటే వెతకడం 'పంచమి' అంటే ఐదవది అని అర్థం. లక్ష్మీదేవి..జగన్నాథుడు తిరిగి రావాలని ఎదురుచూసే సందర్భం ఇది.  జగన్నాథుడు తన తోబుట్టువుల దేవతలతో కలిసి తొమ్మిది రోజుల పాటు గుండిచా ఆలయం దగ్గర ఉండిపోతాడు. శ్రీమదిర్ నుంచి బయలుదేరేముందు ఒక్కరోజులో వస్తానని వాగ్ధానం  చేసి నాలుగు రోజులు గడిచినా రాకపోవడంతో ఐదో రోజు నుంచి వెతకడం ప్రారంభిస్తుంది లక్ష్మీదేవి. అదే హేరా పంచమి వేడుక.  

4 జూలై 2025 బహుదా యాత్ర (తిరిగి వచ్చే యాత్ర)

 పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వెళ్లిన జగన్నాథుడు తిరిగి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి తిరిగివచ్చే యాత్ర. దీనినే బహుదా యాత్ర అంటారు

5 జూలై 2025 

రథయాత్ర ముగింపులో జగన్నాథుడు, బలభద్రుడు , సుభద్రలకు వేసే ప్రత్యేకమైన బంగారు ఆభరణాల అలంకరణ. దీనినే  బంగారు వేషం,  రాజాధిరాజ బేష, సునా వేషం అంటారు. ఇందులో భాగంగా ఈ రోజు దాదాపు 138 రకాల బంగారు ఆభరణాలు అలంకరిస్తారు.  ఈ వేడుక చూసేందుకు లక్షలాది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget