By: RAMA | Updated at : 31 Jul 2022 08:27 AM (IST)
Edited By: RamaLakshmibai
Monthly Horoscope August
ఆగస్టు నెల రాశిఫలాలు ( Monthly Horoscope )
మిథునం
మిథున రాశివారికి ఆగస్టు నెలలో ధన వ్యయం అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. కుజుడు రెండో స్థానంలో ఉన్నందున చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాహనం జాగ్రత్తగా నడపాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. సోదరమూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది
తుల
ఈ నెలలో తులా రాశివారు ఏ పని మొదలెట్టినా పూర్తిచేయగలుగుతారు. కొన్నాళ్లుగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ప్రభుత్వ సంబంధిత కార్యక్రమాలు పూర్తవుతాయి. అష్టమంలో కుజుడి సంచారం వల్ల వాహన ప్రమాదం ఉంది జాగ్రత్త. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టపోతారు. ఉద్యోగం, వ్యాపారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి.
Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
ధనస్సు
ధనస్సు రాశివారికి అష్టమంలో గ్రహసంచారం వల్ల ఆగస్టు నెల అంత అనుకూలంగా ఉండదు. శారీరక శ్రమ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండవు. అకాల భోజనం చేయాల్సి వస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ప్రశాంతత ఉండదు. అందరితోనూ విరోధాలుంటాయి. ఏ మట్లాడినా తప్పే ఎదురవుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయకపోవడం మంచిది.
మకరం
మకర రాశివారికి కూడా అష్టమంలో గ్రహ సంచారం వల్ల పరిస్థితులు పెద్దగా కలసిరావు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు బదిలీలు తప్పవు. అద్దె ఇళ్లలో ఉండేవారు మరో ఇంటికి మారే అవకాశం ఉంది. కొత్త సమస్యలు వేధిస్తాయి. ఏం మాట్లాడినా విరోధం తప్పదన్నట్టు ఉంటుంది.
Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
కుంభం
కుంభ రాశివారికి ఆగష్టు నెల బాగానే ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక ఇబ్బందులుండవు. అవసరానికి ధనం చేతికందుతుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. శత్రువులే మిత్రులుగా మారి సహాయం చేస్తారు. తలపెట్టిన వ్యవహారాలు కలిసొస్తాయి. వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచన కలిసొస్తుంది. స్థిరాస్తులు వృద్ధి చేసే ఆలోచనలు ముందుకు సాగుతాయి.
మీనం
మీన రాశివారికి కూడా ఆగష్టు నెల బావుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఏ పని చేసినా సక్సెస్ అవుతారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబం కారణంగా సంతోషంగా ఉంటారు.
Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ
నోట్: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
janmashtami 2022: తొలి ప్రేమలేఖ అందుకున్నది కృష్ణుడే, ఎవరు రాశారు - కన్నయ్య ఎలా రియాక్టయ్యాడు!
Sun Transit 2022: సింహరాశిలోకి సూర్యుడు - ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆ రాశులవారికి అనారోగ్యం
Horoscope Today 18 August 2022: ఈ రాశివారు లావాదేవీల విషయంలో ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మకండి, ఆగస్టు 18 రాశి ఫలాలు
Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు కన్నుమూసిన ప్రదేశం ఇదే!
Sri Krishna Tatvam : శ్రీకృష్ణుడు అంటే దైవం మాత్రమే కాదు - స్నేహితుడు, గురువు, ప్రేమికుడు - ఇదే కృష్ణతత్వం
Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ లీడర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రామానాయుడు ఫ్యామిలీకి హైకోర్టు గుడ్న్యూస్, తెలంగాణ సర్కార్కు షాక్ - కీలక తీర్పు
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
KCR News: 21న కరీంనగర్కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా