అన్వేషించండి

Margashira Masam 2023: డిసెంబరు 13 నుంచి మార్గశిర మాసం, ఈ నెలలో గురువారాలు చాలా ప్రత్యేకం!

Margashira Masam 2023 డిసెంబరు 13 నుంచి ప్రారంభమయ్యే మార్గశిరమాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అంటారు. ఈ నెలలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకం అని చెబుతారు..ఎందుకంటే...

Significance of Margasira Lakshmi Puja:  2023 డిసెంబరు 13 నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో వచ్చే గురువారాల్లో వ్రతం ఆచరిస్తే అప్పుల బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పారు. 

కార్తీకమాసం నెలరోజుల పాటు భక్తిలో మునిగితేలే వారంతా మార్గశిరమాసంలోనూ అంతకుమించి అనేట్టుంటారు.ఈ నెలంతా కూడా ప్రత్యేకమే అయినా గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు.  శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిరమాసం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా మక్కువ ఎక్కువ. ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వశిస్తారు.

మార్గశిర గురువారం పూజ ఎలా చేయాలంటే

మార్గశిర మాసంలో వచ్చే ప్రతిగురువారం లక్ష్మీపూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిముందు కళకళలాడే ముగ్గువేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానమాచరించి దేవుడి ముందు ముగ్గువేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి.  యధావిథిగా తొలిపూజ గణపతికి పూర్తిచేసి ఆ తర్వాత అమ్మవారిని దీప,ధూప,అష్టోత్తరం , నైవేద్యంతో స్త్రీసూక్తం విధానంలో  షోడసోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం ఫాలో అవలేని వారు...భక్తితో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదువుకున్నా సరిపోతుందంటారు పండితులు.

శ్రీ మహాలక్ష్మి గాయత్రి
ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి 
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌”

లక్ష్మీ గాయత్రి పఠించాలి. పూజ పూరైన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు మార్గశిర లక్ష్మీవారం క్రతం చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. 

Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!

2023 లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి - ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి

  • డిసెంబరు 14 మార్గశిర మాసం మొదటి గురువారం - అమ్మవారికి నైవేద్యం పులగం
  • డిసెంబరు 21 మార్గశిర మాసం రెండో గురువారం - అమ్మవారికి అట్లు-తిమ్మనం నైవేద్యం
  • డిసెంబరు 28 మార్గశిరమాసం మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నైవేద్యం
  • జనవరి 04, 2024 మార్గశిర మాసం నాలుగో గురువారం- పులిహోర, గారెలు నైవేద్యం
  • జనవరి 11, 2024 మార్గశిర మాసం ఐదో గురువారం- పూర్ణం బూరెలు నైవేద్యం

గురువారాల పూజ పూర్తైన తర్వాత ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి స్వయంగా వండి వడ్డించాలి. అమ్మవారిగా భావించి  దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. 

Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!

ఉద్యాసన ఉండదు
సాధారణంగా ఏ పూజ చేసినా చివర్లో ఉద్యాపన చెబుతారు. అయితే మార్గశిర లక్ష్మివారం వ్రతంలో పూర్తైన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పే ప్రక్రియ ఉండదు. ఉద్వాసన అంటే వెళ్లిరమ్మని అర్థం. లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలని కోరుకుంటారు కానీ వెళ్లిరమ్మని అనరు కదా.. అందుతే ఉద్వాసన చెప్పకూడదంటారు. కొన్ని ప్రాంతాల వారు అమ్మవారికి కూడా ఉద్వాసన చెబుతారు...

Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!

ఈ నియమాలు పాటించండి

  • మార్గశిర నోము నోచే స్త్రీలు  గురువారాల్లో శుచిగా ఉండాలి
  • తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం చేయరాదు
  • సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు
  • నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి

గమనిక: పండితుల నుంచి , కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వసించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget