అన్వేషించండి

Mahashivaratri 2026: మహా శివరాత్రి 4 ఝాముల్లో పూజ ఎలా చేయాలి? ఏ ఝాములో ఏ నైవేద్యం సమర్పించాలి?

ShivaPuja 2026: 4 రకాల శివరాత్రులున్నాయి. అన్నిటికన్నా మహాశివరాత్రి అత్యంత విశిష్టమనది. ఈ రోజు నాలుగు ఝాముల్లో పూజా విధానం , శివుడికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోండి...

Mahashivratri Puja Vidhi 2026:  ఫిబ్రవరి 15 ఆదివారం మహా శివరాత్రి. ఈ సందర్భంగా శివ పూాజా విధానం, నాలుగు ఝాముల సమయాలు, ఆ సమయాల్లో సమర్పించాల్సిన నైవేద్యాల వివరాలు తెలుసుకుందాం.

 శివరాత్రి నాలుగు విధాలు

1. నిత్య శివరాత్రి

ప్రతిరోజూ రాత్రివేళ శివుడిని ఆరాధించడమే నిత్య శివరాత్రి

2. పక్ష శివరాత్రి
  
పదిహేను తిథుల్లో చతుర్థశి లయకారుడైన పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది...ఆరోజు చేసె శివారాధన పక్ష శివరాత్రి
  
3.మాస శివరాత్రి 

ప్రతి నెలలో అమవాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి. ఈరోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది, శివపూజకు విశిష్టమైనది 

4. మహా శివరాత్రి

సంవత్సరానికి ఓసారి వచ్చేది మహాశివరాత్రి. ఏటా మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మహాశివరాత్రి

ఇలా నాలుగు విధాలుగా శివుడిని పూజిస్తారు భక్తులు. వీటిలో మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనది. శివ అనే నామం ఉచ్ఛరించడమే మోక్షదాయకం. శివ అనే పేరులో శి అనే అక్షరం పాపాలు హరిస్తుంది వ అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుందని బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే..నాలుగు విధాలుగా శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం. వీటిలో మహాశివరాత్రి వ్రతాన్ని చేసినా మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు
 
మహాశివరాత్రి ఏ ఝాములో ఎలా పూజచేయాలి?
 
మహా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని 'లింగ పురాణం' చెబుతోంది. రోజంతా శివనామస్మరణ, అభిషేకాలు చేయడమే కాదు రాత్రి వేళ నాలుగు ఝాముల్లో అభిషేకాలు పూజలు చేయాలని లింగపురాణం చెబుతోంది

ఝాము సుమారు 3 గంటల సమయం ఉంటుంది. ఈ నాలుగు ఝాముల్లో శివుడికి అభిషేకాలు, బిల్వపత్ర సమర్పణ చేస్తారు.  

ఫిబ్రవరి 15 ఆదివారం ఝాము సమయాలు గమనిస్తే
 
మొదటి ఝాము

మొదటి ఝాము సమయం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నవరకు. ఈ సమయంలో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి, పులగం  నైవేద్యంగా సమర్పించవలెను.
 
రెండవ ఝాము

రెండవ ఝాము రాత్రి తొమ్మిదిన్నర నుంచి అర్థరాత్రి పన్నెండున్నవరకు ఉంటుంది. ఈ ఝాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించాలి. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి

మూడవ ఝాము

మూడవ ఝాము సమయం దాదాపు అర్థరాత్రి పన్నెండురన్నర నుంచి మూడున్నవరకు. ఈ ఝాములో శివుడిని నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజించాలి. నువ్వులతో వండిన నైవేద్యాన్ని సమర్పించాలి
 
నాల్గవ ఝాము

నాల్గవఝాము సమయం దాదాపు మూడున్నర నుంచి సూర్యోదయం వరకు. ఈ సమయంలో శివుడిని తుమ్మిపూలతో పూజించి అన్నాన్ని నివేదించాలి
 
మహాశివరాత్రి వేళ మూడవ ఝాము అత్యంత విశిష్టమైన సమయం. ఈ సమయంలో శివయ్యను పూజిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

మహాశివరాత్రి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉపవాసం, జాగరణ.
 
శివలింగం మూలం బ్రహ్మ స్వరూపం

మధ్యభాగం విష్ణు స్వరూపం

పైభాగం శివస్వరూపం

పానపట్టం గౌరీ స్వరూపం

అంటే..శివలింగాన్ని పూజిస్తే సృష్టి, స్థితి లయకారులైన త్రిమూర్తులను, ఆదిశక్తిని పూజించిన్టే

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget