అన్వేషించండి

Mahashivratri Vastu Tips: ఆర్థిక, ఆరోగ్య సమస్యల పరిష్కారం, వాస్తు దోషాలు తొలగిపోయేందుకు మహాశివరాత్రి పూజ ఇలా చేయండి!

Mahashivratri Vastu Tips: మహాశివరాత్రి నాడు, శివాలయాలు ఇళ్లలో ఉదయం నుంచి రాత్రి వరకు అభిషేకం నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు కొన్ని వాస్తు పరిహారాలను అమలు చేయడం శుభప్రదం అని చెబుతారు పండితులు

Mahashivratri 2025 Vastu Tips: భోళాశంకరుడు భక్త సులభుడు అని, తన భక్తులను వెంటనే అనుగ్రహిస్తాడని విశ్వాసం.  వారు దేవతలు, గంధర్వులు, మానవులు లేదా రాక్షసులు ఎవరైనా కానీ భక్తితో ప్రార్థించి కోరుకున్న వరాలను వెంటనే ప్రసాదిస్తాడు శివుడు.  అయితే కొత్తవరాలు అవసరం లేదు..ఇంట్లో ఉండే సమస్యలు తొలగిపోతే చాలని భావించేవారు శివరాత్రి రోజు ఈ వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

మహాశివరాత్రి నాడు కొన్ని వాస్తు పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక, మానసిక, వైవాహిక , శారీరక సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రికి సంబంధించిన ఈ వాస్తు పరిహారాలు ఏంటో తెలుసుకుందాం

ప్రతికూల శక్తి 

వాస్తు ప్రకారం మీ ఇంటి నుంచి ప్రతికూలతను తొలగించడానికి, మహాశివరాత్రి నాడు శివుడికి ప్రార్థనలు చేసి, నీటి కుండ నుంచి నీటిని సేకరించి ఇంటికి తీసుకురండి. శివయ్యకు పూజ చేసిన తర్వతా ఆ నీటిని మీ ఇంటి ప్రతి మూలలో చల్లుకోండి. అలా చేయడం వల్ల  ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ప్రతికూల శక్తి నాశనం అవుతుంది  సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని నమ్మకం.

సంపద ప్రవాహం 

పురాతన గ్రంథాలు పాదరస శివలింగాన్ని స్వయం ప్రకటిత లోహంగా భావిస్తాయి. దీని వివరణ చరక సంహితతో సహా అనేక గ్రంథాలలో కనిపిస్తుంది. మహాశివరాత్రి నాడు తమ ఇళ్లలో పాదరస శివలింగాన్ని ప్రతిష్టించే వారికి లక్ష్మీదేవి, శివుడు , కుబేరుడి నుంచి శాశ్వతంగా అనుగ్రహం పొందుతారని శివ పురాణం పేర్కొంది. ఇది సంపద ప్రవాహాన్ని పెంచుతుంది. పాదసర శివలింగాన్ని పూజించే వారిని మహాకాళుడు   స్వయంగా రక్షిస్తారని నమ్ముతారు. గంధకంతో తయారు చేసిన అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన శివలింగం ఇది. ఆరోగ్యం, కోర్కెలు నెరవేర్చి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది.ఈ ఒక్క శివలింగాన్ని పూజిస్తే 108 సాధారణ శివలింగాలను పూజించినట్టే అని నమ్ముతారు. పాదరస శివలింగానికి క్రమం తప్పకుండా అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు
 
దీపం

మహాశివరాత్రి నాడు శివాలయంలో నాలుగు వైపులా నేతితో దీపంవెలిగించండి. ఆలయ ప్రాంగణంలో కూర్చుని శివచాలీసా పఠించండి. శివాలయానికి వెళ్లే అవకాశం లేకపోతే ఇంట్లో దేవుడి మందిరంలో శివలింగం దగ్గర నేతితో దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం
 
ఆనందం శ్రేయస్సు 

ఇంట్లో వాస్తు దోషాలను తొలగించడానికి, ఇంటికి తూర్పు లేదా వాయువ్య దిశలో బిల్వ చెట్టును నాటి, దానికి నీరు పోసి, సాయంత్రం దాని కింద నెయ్యి దీపం వెలిగించండి. ఇంటి సమీపంలో బిల్వవృక్షం లేకపోతే ఆలయ ప్రాంగణంలో  బిల్వవృక్షం అయినా దీపం వెలిగించవచ్చు.

బిల్వ దళాలతో శివార్చన

అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి మహాశివరాత్రి రోజు పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ రోజు బిల్వదళాలలతో అర్చన చేస్తే వ్యక్తిగత జీవితంలో , వృత్తిపరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మార్చి 15 నుంచి నెల రోజులు ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతోంది! సూర్య సంచారంతో మీకు అన్నీ శుభాలే!
మార్చి 15 నుంచి నెల రోజులు ఈ రాశులకు అదృష్టం తలుపు తడుతోంది! సూర్య సంచారంతో మీకు అన్నీ శుభాలే!
Surya Gochar 2026: మీనంలోకి సూర్యుడు! ఏప్రిల్ 14 వరకూ ఈ 4 రాశులవారికి ప్రతికూల ఫలితాలు, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం!
మీనంలోకి సూర్యుడు! ఏప్రిల్ 14 వరకూ ఈ 4 రాశులవారికి ప్రతికూల ఫలితాలు, చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం!
Food Astrology: మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
మీ రాశి ప్రకారం మీకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? చెక్ చేసుకోండి మీరే అవునంటారు!
GoldJewelry: బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
బంగారం కొనే ముందు ఈ నక్షత్రాలు చూడండి! శుభ ఫలితాలనిచ్చే ముహూర్తాలు, రహస్యాలు తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
జగిత్యాలలో రాజకీయ ప్రకంపనలు! 40 ఏళ్ల కాంగ్రెస్‌ బంధానికి జీవన్ రెడ్డి గుడ్‌బై? కారు ఎక్కనున్న సీనియర్‌ నేత!
YS Avinash Reddy: హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
హత్య చేసిన దస్తగిరికి మద్దతు - డ్రైవర్ ప్రసాద్ విషయంలో సైలెంట్ - సునీతపై అవినాష్ రెడ్డి ఆరోపణలు
Iran War Updates: నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
నెతన్యాహు వీడియోలు ఓకే - మరి ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ వీడియోలు ఎక్కడ - నిజంగానే కోమాలో ఉన్నారా?
Telangana Assembly: వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
వందేమాతరం పాడకుండా వాకౌట్ చేసిన మజ్లిస్ ఎమ్మెల్యేలు - బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
Nandini Sidda Reddy : తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
తెలంగాణ అక్షర శిఖరానికి జాతీయ గౌరవం! నందిని సిధారెడ్డిని వరించిన కేంద్ర సాహిత్య పురస్కారం 
Sreeleela : శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
శ్రీలీలతో రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? - ఇదిగో క్లారిటీ
Iran Dancing Missile: డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
డాన్సింగ్ మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్ - వీటి ప్రత్యేకత తెలుసా?
Embed widget