చెడు ఆలోచనలతో పోరాటం సాధ్యమా? మీ మనసును శుభ్రం చేసే మార్గాలు తెలుసా మీకు!
Stop Thinking Bad Thoughts: మంచి ఆలోచనలు ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానికి కీలకం. ఇలా ఉండాలంటే చెడు ఆలోచన నుంచి తప్పించుకోవాలి? అదెలా సాధ్యమవుతుంది?

ఒక్క మంచి ఆలోచన జీవితాన్ని అద్భుతమైన మలుపు తిప్పితే... ఓ చెడు ఆలోచన నేరుగా పాతాళానికి తొక్కేస్తుంది. అయితే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక సందర్భంలో చెడు ఆలోచనలు ముంచెత్తుతాయి. వాటి నుంచి వెంటనే బయటపడితే ఎలాంటి ప్రభావం ఉండదు..కానీ వాటిలోనే కూరుకుపోతే చాలా నష్టపోతారు. అది వ్యక్తిగతజీవితం, ఉద్యోగం, వ్యాపారం, విద్య ఏదైనా కానీ... అయితే చెడు ఆలోచనల ఉప్పెన నుంచి ఎలా బయటపడాలి? ఆరోగ్యకరమైన, సంతోషకరమైన , విజయవంతమైన జీవితానికి అడ్డంకిగా ఉండే మనస్సులో కొన్ని చెడు ఆలోచనలను నివారించడానికి ప్రేమానంద్ మహారాజ్ ఎన్నో మార్గాలను సూచించారు. అవే ఇవి...
మంచి ఆలోచనలు కలిగి ఉండటం వలన వ్యక్తి జీవితంలో సానుకూలత వస్తుంది, ఇది మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి .. ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. మంచి ఆలోచనలు ఇతరుల పట్ల దయను కలిగిస్తాయి , జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరం అయిన శక్తిని ఇస్తాయి.
భగవంతుని నామాన్ని జపించండి. మీ మనస్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు..అందుకోసం కొద్దిపాటి సమయం దొరికినా పుస్తకాలు చదవండి. ఆధ్యాత్మిక వీడియోలు చూడండి. శ్లోకాలు పఠించండి లేదంటే వినండి. ప్రతికూల ఆలోచనలతో కలత చెందకుండా వాటిని భగవంతుని ధ్యానంలోకి మార్చుకోండి.
మంచి వ్యక్తులతో సమయం స్పెండ్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి .. సానుకూల ఆలోచనలకు స్థలం ఏర్పడుతుంది. సరైన సహవాసం మంచి జ్ఞానాన్ని అందిస్తుంది. మంచి వ్యక్తుల సహవాసం మనసుని ఖాళీగా ఉంచకుండా కాపాడుతుంది. చెడు ఆలోచనలను తరిమికొడుతుంది.
మీ ఇష్టదైవాన్ని పూజించండి. మీరు విశ్వసించే భగవంతుడి ధ్యానంలో ఉండడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. ఇందులో భక్తితో పాటూ ఏర్పడే నమ్మకం..మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చెడు ఆలోచనలను నాశనం చేస్తుంది. మనసుకి ప్రశాంతత ఇస్తుంది.
అహంకారం, లోభం కోపాన్ని వదిలివేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. సానుకూల ఆలోచనలు వస్తాయి. నేను మాత్రమే గొప్ప అనుకునే ఆలోచన, స్వార్థపూరిత వైఖరి, ఎదుటివారికి సహాయం చేయాలన్న ఆలోచన కూడా లేకపోవడం మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. మనసు బరువును పెంచుతుంది. కోపం మీకు శత్రువులను పెంచుతుంది. అందుకే అహంకారం, లోబం, కోపాన్ని వదిలేయడం వల్ల మనసు తేలికపడుతుంది. నిత్యం మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది.
భగవంతుడి ధ్యానం, భజన, ధ్యానం, మంచి వ్యక్తుల సహవాసం..వీటివల్ల ఈ లోపాలను అధిగమించి మనసుని శుద్ధి చేసుకోగలుగుతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారం ఆధారంగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఇది చెప్పడం ముఖ్యం ABP దేశం ఎటువంటి నమ్మకాన్ని, సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
నరక చతుర్దశి 2025 ఎప్పుడు! 19 లేదా 20 అక్టోబర్ 2025 ? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
దీపావళి రోజు అర్థరాత్రి కాళీ పూజ! శుభ ముహూర్తం, పూజా విధానం, నైవేద్యం, మంత్రాలు, విశిష్టత తెలుసుకోండి!





















