Kali Puja 2025: దీపావళి రోజు అర్థరాత్రి కాళీ పూజ! శుభ ముహూర్తం, పూజా విధానం, నైవేద్యం, మంత్రాలు, విశిష్టత తెలుసుకోండి!
Diwali Kali Puja 2025: కాళీ పూజ ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు. ఏటా దీపావళి రోజు అర్థరాత్రి జరిపే ఈ పూజకు సంబంధించి పూర్తి వివరాలు ఇవిగో...

Kali Puja 2025 Date: కాళీ పూజను ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు..అంటే దీపావళి పండుగ రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది కాళీ పూడ అక్టోబర్ 20న వచ్చింది.
కాళీ పూజను శ్యామ్ పూజ అని కూడా పిలుస్తారు. హిందూ మతంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ శక్తి, రక్షణ , చెడును నాశనం చేయడానికి చిహ్నంగా పరిగణిస్తారు.
దుర్గా మాత ఆగ్రహ రూపమే కాళీమాత
కాళీ పూజ ప్రాముఖ్యత
ఈ రోజు కాళీమాతను పూజించడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. జీవితంలో సుఖం , సంతోషం ఉంటుంది. ఈ పండుగ ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాంలో ప్రధానంగా జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో దీపావళి రోజు అర్థరాత్రి కాళీ పూజ నిర్వహిస్తారు.
కాళీ పూజను ఎలా జరుపుకోవాలి?
కాళీ మాత పూజను తంత్ర-మంత్రాలతో ముడిపడి ఉన్న వ్యక్తులు మాత్రమే చేస్తారని చాలా మంది నమ్ముతారు, అయితే ఇది పూర్తిగా నిరాధారమైనది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మంత్రాలు , మతపరమైన ఆచారాల ద్వారా దేవి కాళీని పూజించవచ్చు.
కాళీ మాతకు నైవేద్యంగా పండ్లు, స్వీట్స్ తో పాటూ చేపలు, మాంసం కూడా సమర్పిస్తారు. భారతదేశంలో కోల్‌కతా, గౌహతిల్లో ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.
కాళీ పూజ 2025 శుభ ముహూర్తం సమయం (Kali Puja 2025 Time And Shubh Muhurat)
కాళీ పూజ నిషిద్ధ కాలంలో- అక్టోబర్ 20 అర్థరాత్రి 11:55 నుంచి రాత్రి 12:44 వరకు
అమావాస్య తిథి 2025 అక్టోబర్ 20 మధ్యాహ్నం 2:40 గంటల నుంచి అక్టోబర్ 21 మంగళవారం సాయంత్రం 4:05 గంటల వరకూ ఉంది.
కాళీ పూజ 2025 సామాగ్రి ( Kali Puja 2025 Samagri)
వినాయకుడి విగ్రహం, కాళీ మాత ఫొటో పెట్టి పూజ చేయాలి
ధూపం-దీపం, బియ్యం, దర్బ గడ్డి, చందనం పొడి... షోడసోపచారాలతో పూజ చేయాలి
కాళీ మంత్రం (Maa Kali Manta 2025)
మా కాళీ బీజ మంత్రం- ఓం క్రీం కాళీ
కాళీ మాతా మంత్రం- ఓం శ్రీ మహా కాళికాయై నమః
కాలికా-యేయి మంత్రం- ఓం క్లీం కాలికా
కాళీ గాయత్రీ మంత్రం- ఓం మహా కల్యే చ విద్మహే స్మసన్ వాసిన్యై చ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాత
దక్షిణ కాళీ ధ్యాన మంత్రం- ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రుం క్రీం క్రీం దక్షిణ కాళికే క్రీం క్రీం క్రీం హ్రుం హ్రుం హ్రీం హ్రీం హ్రీం
పదిహేను అక్షరాల మంత్రం- ఓం హ్రీం శ్రీం క్లీం ఆద్య కాలికా పరం ఈశ్వరీ స్వాహా
కాళీ మా ప్రార్థన కోసం మంత్రం- క్రింగ్ క్రింగ్ క్రింగ్ హింగ్ క్రింగ్ దక్షిణే కాలికే క్రింగ్ క్రింగ్ క్రింగ్ హ్రింగ్ హ్రింగ్ హంగ్ హంగ్ స్వాహా
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABP దేశం ఈ సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















