Horoscope Today 16 November 2021: ఈ రాశుల వారు అమాయకులు… మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి.. మీరు అందులో ఉన్నారా..!
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
మేషం
పనిలో విజయం సాధిస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. భగవంతుని ఆరాధించడంలో ధైర్యాన్ని పొందుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించవచ్చు. టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది.
వృషభం
మీ సహకారంతో మిత్రుని పని పూర్తి అవుతుంది. రుణం మొత్తాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది. ఈరోజు రోజంతా బిజీగా ఉంటారు. రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ పని ముందుకు సాగుతుంది. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మాట్లాడేటప్పుడు ఓపికగా వ్యవహరించండి.
మిథునం
వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చేతికందాల్సిన మొత్తం అందుతుంది. బంధువుతో విభేదాలు రావొచ్చు. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. చాలా వరకు పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీకు మంచి సమాచారం అందుతుంది.
కర్కాటకం
ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల్లో ప్రయోజనం ఉంటుంది. మిత్రులను కలుస్తారు. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు. మీ సలహాతో చాలా మంది పనులు పూర్తవుతాయి. ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
సింహం
మానసికంగా బలంగా ఉంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ బాధ్యతను నిర్వర్తించగలరు. కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. స్తిరాస్తుల కొనుగోలుకి ఇదే సరైన సమయం.
కన్య
ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. దీర్ఘకాలిక వ్యాధి బయటపడొచ్చు. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు కాస్త బద్దకంగా ఉంటారు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు లాభపడతారు. యువత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. రహస్య చర్చలను నివారించండి.
తుల
ఈ రోజు మీకు మంచి రోజు. స్నేహితులను కలుస్తారు. మీరు ప్రయాణం చేయవలసి రావొచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిస్క్ తీసుకోవద్దు. మాటల్ని అదుపులో ఉంచుకోండి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.
వృశ్చికం
వ్యాపారులకు ప్రయాణ అవకాశాలు లభిస్తాయి. పెద్ద సమస్య ఈరోజు తొలగిపోతుంది. కొన్ని పనుల గురించి కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
ధనుస్సు
అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి.
మకరం
ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. అధిక పని వల్ల అలసట ఉంటుంది. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. అడగకుండా సలహా ఇవ్వకండి. కుటుంబంలో అసమ్మతి ఎదుర్కోవలసి రావొచ్చు. బంధువులను కలుస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రిస్క్ తీసుకోవద్దు. మీ బాధ్యతను నెరవేర్చడానికి బద్దించవద్దు. ప్రతిపనిలో మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు.
మీనం
మోసగాళ్ల పట్ల జాగ్రత్త వహించండి. కొందరికి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉండవచ్చు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Also Read: ఎంగిలి తింటున్నారా? వామ్మో కరోనా కంటే అదే పెద్ద కష్టమట!
Also Read: శనివారం ఈ వస్తులు కొన్నా-తీసుకున్నా ….శని మిమ్మల్ని వదలదంట
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..
Also Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి