Horoscope Today 27 December 2021: ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 డిసెంబరు 27 సోమవారం రాశిఫలాలు
మేషం
ఇంటి సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. ఉద్యోగులకు శుభసమయం. ఉద్యోగం మారాలనే ఆలోచన వస్తుంది. చాలా కాలంక్రితం నిలచిపోయిన మొత్తం చేతికందుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు.
వృషభం
అనుకోకుండా పాత మిత్రులను కలుస్తారు. ఓ పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మిథునం
వ్యాపారంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని అనుమతించవద్దు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని పనుల్లో అనుకున్నంత ఫలితం రాకపోవడంతో మనసు కలత చెందుతుంది. పని ప్రదేశంలో ఒత్తిడి ఉంటుంది.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
కర్కాటకం
శుభ కార్యాల్లో పాల్గొంటారు. బాధ్యతల నుంచి పారిపోవద్దు..మీరు సక్రమంగా నిర్వర్తించగలరు. ఉద్యోగులు పదోన్నతికి సంబందించిన సమాచారం అయినా, ఇంక్రిమెంట్ కి సంబంధించిన సమాచారం అయినా వింటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. విద్యార్థులకు శుభసమయం. వ్యాపారులకు లాభాలొస్తాయి.
సింహం
ఈ రోజు మీకు బాగానే ఉంటుంది. పాత మిత్రులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి. వివాహితుల మధ్య వివాదాలుంటే సమసిపోతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. మీ వ్యక్తిత్వానికి ప్రజలు ఆకర్షితులవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
కన్య
మీరు ఈ రోజు మేధావులను కలుస్తారు. స్నేహితులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. తప్పుడు విషయాన్ని వ్యతిరేకించండి. రిస్క్ తీసుకోకండి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయుల పూర్తి మద్దతు లభిస్తుంది. చాలారోజులుగా రావాల్సిన మొత్తం చేతికందుతుంది.
Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
తుల
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు విమర్శలు ఎదుర్కోవచ్చు..పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండండి. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనూ తొందరపాటు వద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించవద్దు. ప్రతికూల ఆలోచనలను వదిలేయండి.
వృశ్చికం
ఈ రోజు ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు శుభవార్త వింటారు. న్యాయపరమైన అడ్డంకుల నుంచి బయటపడవచ్చు.వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో పార్టీల్లో పాల్గొంటారు. ధనస్సు
ధనుస్సు
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. అవసరమైన వారికి సహాయం చేస్తారు. పెద్ద ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇంటికి అతిథిలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది. నిరుద్యోగులు ప్రయత్నాలు సఫలం అవుతాయి.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
మకరం
ఉద్యోగుల పని బాగా సాగుతుంది, కార్యాలయంలో ఎవరితోనైనా మనస్ఫర్థలు రావొచ్చు. అపరిచితులను ఎక్కువగా నమ్మొద్దు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ సలహాతో చాలామంది పనులు పూర్తవుతాయి.నిరుద్యోగులకు శభసమయం. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
ఎవరైనా మీ క్రెడిబులిటీ దెబ్బతీయవచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో తొందరపడకండి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పొట్టకి సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. రహస్య సమాచారం ఎవ్వరికీ ఇవ్వకండి, చెప్పకండి. ఎవ్వరికీ అప్పు ఇవ్వొద్దు..తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
మీనం
ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ప్రవర్తన చాలామందిని మెప్పిస్తుంది. మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. కుటుంబంతో కలసి బయటకు వెళ్ళొచ్చు. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈరోజు మీ దినచర్య చాలా చురుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పెద్దల అనుభవాలు తెలుసుకోవడం ద్వారా పనిలో ప్రయోజనం పొందుతారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి