By: ABP Desam | Updated at : 24 Dec 2021 09:51 PM (IST)
Edited By: RamaLakshmibai
Zodiac Signs
ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్. ఎక్కడ విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు తల్లిదండ్రులు మాట్లాడుకున్నా మా పిల్లలు ఇంత షార్ప్ గా ఉన్నారంటే…మా పిల్లలు అంతకుమించి అంటున్నారు. వాస్తవానికి ఈ జనరేషన్ పిల్లలంతా తెలివైనవాళ్లే. ఏదీ ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలాగాప్రవర్తిస్తుంటారు. అయితే వీరిలో అందరి ఇష్టాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రతిభ దాగి ఉంటుంది. మరి ఏ రాశిలో పుట్టిన పిల్లలు అత్యంత తెలివైన వాళ్లో చూద్దాం.
మేషం
ఈ రాశిలో పుట్టిన పిల్లల్లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. ఎంత విపత్కర పరిస్థితుల్లో అయినా అలవోకగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. కేవలం వీరి సమస్యలను పరిష్కరించుకోవడం మాత్రమే కాదు…ఎదుటివారెవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే స్పందించడంలోనూ మేషరాశి పిల్లలు ముందుంటారు.
వృషభం
ఈ రాశిలో పుట్టిన పిల్లలకు పట్టుదల ఎక్కువ. అందరికీ సాధారణంగా కనిపిస్తారు కానీ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఎదుగుతారు. పైగా ఓ టార్గెట్ పెట్టుకుంటే కచ్చితంగా రీచ్ అవుతారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరిలో సంకల్ప బలం చాలా ధృడంగా ఉంటుంది. అందుకే అనుకున్న పనిని కచ్చితంగా సాధిస్తారు.0
మిథునం
ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో క్రియేటివిటీ ఎక్కువ. మంచి మాటకారులు కూడా. ఎదుటివారిని మాటలతో ఇట్టే కట్టిపడేస్తారు. సృజనాత్మక ఆలోచనలు కలిగిఉంటారు. ఏ పని చేయడంలో అయినా వీరి రూటే సెపరేటు. వయసు చిన్నదే అయినా ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి.
Also Read: ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.. మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
కర్కాటకం
ఈ రాశి పిల్లలు ఎదుటి వారి భావాలకు ఎక్కువ విలువనిస్తారు. తమకో ఆలోచన ఉన్నప్పటికీ ఎదుటివారి కంఫర్ట్ ని ఆలోచించి నడుచుకుంటారు. ఎంత కఠినమైన వ్యక్తిని అయినా అర్థం చేసుకునే నైపుణ్యం వీరిసొంతం. మరీ ముఖ్యంగా కర్కాటక రాశిలో జన్మించిన పిల్లలు ఏ విషయాన్ని అస్సలు దాచుకోలేరు. వీరికి ఓ విషయం తెలిసిందంటే…వెంటనే ఎవరో ఒకరికి చేరవేసేస్తారు….
సింహం
అడవికి రాజు సింహం అని చెప్పుకున్నట్టే... సింహ రాశిలో పుట్టిన పిల్లలు కూడా ఈ కోవకే చెందుతారట. వారి వారి సామ్రాజ్యంలో వాళ్లే యువరాజులు. వీరిలో నాయకత్వ లక్షణాలకు కొదవే ఉండదు. సింహరాశిలో పుట్టిన పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు. వీరి ప్రవర్తన కూడా వంద మందిలో ప్రత్యేకంగా ఉంటుంది. అంతులేని శక్తి సామర్థ్యాలు కలిగిఉంటారు. ఒకపని అనుకుంటే భయపెట్టో బతిమిలాడో చేయించుకునే నేర్పు కలిగి ఉంటారు.
కన్య
ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో కచ్చితత్వం ఎక్కువ. ప్రతి విషయం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. చిన్నప్పటి నుంచీ అన్ని పనుల్లోనూ చాలా నియమబద్దంగా వ్యవహరిస్తారు. ఆటల్లో, చదువులో అన్నింటిలోనూ వీరిదే ప్రధమ స్థానం.
Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
తుల
ఈ రాశి పిల్లలు.. త్రాసులు సమానంగా తూగుతాయన్నట్టు సహనం, ఓర్పు అన్నీ సమానంగా ఉంటాయ్. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎవరి వల్ల తమపని పూర్తవుతుందనే విషయాలపై వీరికి చాలా క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇతరులతో తమ పనులు పూర్తిచేయించుకోవడంలో వీరు నేర్పరులు.
వృశ్చికం
ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఏదైనా అనుకుంటే చాలు గోల్ రీచ్ అయ్యేవరకూ కష్టపడతారు. ఏపని చేసినా మొక్కుబడి అనే మాటే ఉండదు. ఫుల్ ఫోకస్ పెడతారు. అన్ని రంగాల్లో రాణించగల నైపుణ్యం వీరి సొంతం. వీరి అభిరుచులు చాలా ప్రత్యేకంగా ఉంటాయ్.
ధనుస్సు
ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉంటారు. ఎంత కష్టాన్ని అయినా ఇష్టంగా మార్చుకోవడంలో వీళ్లకి వీళ్లే సాటి. ముఖ్యంగా సమస్య పెద్దది అయినా..చిన్నది అయినా …చివరికి అసాధ్యమైనది అయినా..గట్టి సంకల్పంతో పూర్తి చేస్తారు.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
మకరం
ఈ రాశిలో జన్మించిన పిల్లల్లో మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. చిన్నప్పుడే ఎక్కువ తెలుసుకుంటారు. ఏ పని చేయాలి…ఆ పని వల్ల వచ్చే లాభం ఏంటి..నష్టం ఏంటి బేరీజు వేసుకుంటారు. లాభం అయితే ముందడుగు వేస్తారు. నష్టం అని అనిపించినా, వృధా అనే ఆలోచన వచ్చినా అస్సలు అటువైపు పోనేపోరు. ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు.
కుంభం
ఈ రాశిలో పుట్టిన పిల్లలకు క్రియేటివిటీ ఎక్కువ. సమస్యలను నుంచి ఎలా తప్పించుకోవాలో బాగా తెలుసు. కొత్త కొత్త అంశాలను వెలుగులోకి తేవడానికి ప్రయత్నిస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం
ఈ రాశిలో జన్మించిన పిల్లలు వండర్ ఫుల్ కిడ్స్ అనే చెప్పాలి. ఇతరుల సమస్యలను వారి బాగోగులను చూసుకుంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా…ఎవ్వరు ఏం చెప్పినా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
IPL 2022: కోల్కతాలో వర్షం! ఆట రద్దైతే GT vs RRలో విజేతను ఎలా నిర్ణయిస్తారు?
Petre Rates States : పెట్రో పన్నులపై రగడ ! ఎప్పుడూ కేంద్రమేనా రాష్ట్రాలు తగ్గించవా ?
Major: 'మేజర్' సినిమాకి స్టాండింగ్ ఒవేషన్ - సెన్సార్ టాక్ ఇదే
KTR In Davos: తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆశీర్వాద్ పైప్స్ తయారీ ప్లాంట్ - విదేశాలకు ఎగుమతి చేసేలా ప్లానింగ్