Horoscope Today 21 December 2021: ఆ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.. మీ రాశిఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం
మీరు ఒకేసారి చాలా బాధ్యతలను నిర్వర్తించాల్సి రావొచ్చు. తలపెట్టిన పనులు పూర్తిచేశారు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడపగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. దినచర్యలో మార్పులు చేసుకోవచ్చు.
వృషభం
బాధ్యతలు నిర్వర్తించడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం.
మిధునం
శత్రువుల చర్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దూరప్రాంత ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. రోజంతా బిజీగా ఉంటారు ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు ఖర్చు ఎక్కువ అవుతుంది. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మీ ప్రవర్తనలో కఠినత్వాన్ని అధిగమించేందుకు ప్రయత్నించండి.
Also Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
కర్కాటకం
కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇంటి బాధ్యతలను నిర్వర్తించగలుగుతారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. బంధువులతో సమావేశం అవుతారు. అవసరమైన పనులు పూర్తిచేస్తారు.
సింహం
రోజంతా చిరాకుగా ఉంటారు. పనిలేక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒంటరిగా సమయం గడపడానికి ప్రయత్నించండి. అవసరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు.
కన్య
వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎవరితోనైనా అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. మీరు మీ బాధ్యతను నెరవేర్చడంలో కొంత ఫెయిల్ అవుతారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. చదువుకోవడాన్ని ఎంజాయ్ చేస్తారు.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
తుల
ఎవరితోనైనా కొనసాగుతున్న వివాదం పరిష్కారమవుతుంది. వ్యాపారానికి సంబంధించి కొత్త ప్రణాళికను రూపొందించవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. మీ వ్యవహారాల్లో సౌలభ్యం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృశ్చికం
నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణంలో ఎవరితోనైనా గొడవలు రావచ్చు. మాటలు విసిరేయవద్దు, కాస్త సంయమనం పాటించండి. అసభ్య పదాలు వాడొద్దు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి.
ధనుస్సు
బంధువుతో వివాదాలు తలెత్తవచ్చు. స్థిరాస్తి విషయంలో ఒత్తిడి ఉంటుంది. పనులు ముందుకు సాగుతాయి. వ్యాపారాల్లో లాభం ఉంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. చాలా రోజులుగా చేతికందాల్సిన మొత్తం వస్తుంది.
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
మకరం
వ్యాపారంలో లాభం ఉంటుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఈరోజు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి తగ్గుతుంది. స్నేహితులు సహాయం చేస్తారు. బంధువులను కలుస్తారు. కారణం లేకుండా ఖర్చు చేయడం మానుకోండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కుంభం
సామాజిక బాధ్యత పెరుగుతుంది. అవసరమైన పనుల కోసం ఇతర నగరాలకు వెళతారు. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ప్రస్తుతానికి ఆస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన విరమించుకోండి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మీనం
ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేస్తారు. బంధువుల ఇంట ఓ కార్యక్రమానికి హాజరవుతారు. ఈరోజు కలిసొస్తుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి.
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

