Horoscope Today 17th August 2022: ఈ మూడు రాశులవారికి అంత అనుకూలసమయం కాదిది జాగ్రత్త, ఆగస్టు 17 రాశిఫలాలు
Horoscope 17th August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Horoscope Today 17th August 2022
మేషం
ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు రావడానికి ఇది మంచి సమయం. కొత్త పరిచయాలు లేదా కొత్త ఒప్పందాలు మీకు ఇబ్బందిగా మారుతాయి. ఆర్థిక సమస్యలుంటాయి.తల్లి వర్గం నుంచి మీరు ఊహించని ప్రయోజనం పొందుతారు.
వృషభం
ఈ రోజు ఇంటికి కొత్త అతిథి వచ్చే అవకాశం ఉంది, దీని కారణంగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. స్నేహితుడితో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. ప్రేమికులకు మంచిరోజు.ఏదైనా పెద్ద ఆఫర్ పొందడం ద్వారా డబ్బు చేతికందుతుంది.
మిథునం
ఈ రోజు మీరు డబ్బు ప్రణాళికలో ఒకరి మద్దతు పొందుతారు.అత్యవసరం అయితే తప్ప ప్రయాణం చేయకపోవడమే మంచిది.ఈ రోజు తొందరగా అలసిపోతారు. అందాల్సిన డబ్బు చేతికందదు. గృహస్థులు సంతోషంగా ఉంటారు. కోపం తగ్గించుకోండి.
కర్కాటకం
ఈ రోజు మీకు మంచిది కాదు. తోబుట్టువులతో వివాదాలు మీకు తలనొప్పి తెచ్చిపెడతాయి. ప్రేమ సంబంధాలు అలాగే ఉంటాయి. అంకితభావంతో పని చేస్తే ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. మీ వైఖరిని మార్చుకుని సిన్సియర్‌గా పని చేస్తే మీ ర్యాంక్, రెమ్యునరేషన్ , పాపులారిటీ పెరుగుతుంది.
Also Read: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!
సింహం
ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన పనిని నిర్వహించడంలో విజయం సాధిస్తారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన సొమ్ము చేతికందుతుంది. మీ సమర్థతను పూర్తిగా వినియోగించుకుంటే సక్సెస్ అవుతారు.
కన్య
ఈ రోజు పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. స్టాక్ బెట్టింగ్‌లో జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి. ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు. పనిలో ఏకాగ్రత లేకపోవడం వల్ల ఇబ్బందిపడతారు. ఉద్యోగులు, వ్యాపారులు పనివిషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తుల
ఈ రోజు చాలా వివాదాస్పదంగా ఉంటుంది. మీరు మీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ బలహీనతలను ఉపయోగించుకుని ప్రయోజనం పొందేవారున్నారు జాగ్రత్త. మీరు మీ సహోద్యోగులతో మీ ప్రణాళికలు లేదా మీ ఆశయాలను బహిర్గతం చేయకూడదు, అస్సలు చర్చించకూడదు.
వృశ్చికం
ఈరోజు మీరు స్నేహితుల నుంచి కొన్ని మంచి సలహాలు పొందుతారు. మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి, ఇది మీకు పనిలో తక్కువ అనుభూతిని కలిగిస్తుంది. పెద్దగా తెలియని వ్యక్తిని నమ్మకపోవడం మంచిది. ఆపదలో ఉన్నవారికి మీరు సహాయం చేస్తారు.
Also Read: మీది ఏ రాశి, మీరు ఆఫీసులో సహోద్యోగులతో ఎలా ఉంటారో తెలుసా!
ధనుస్సు
మీరు ఇంతకు ముందెన్నడూ ఆలోచించని కొన్ని మూలాల నుంచి డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈరోజు పెట్టిన పెట్టుబడి చాలా లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి రావొచ్చు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా చేసే చర్యల వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. పనికి భయపడవద్దు.
మకరం
మీ ఉద్యోగ పరిస్థితిలో మెరుగుదల సాధ్యమవుతుంది. కానీ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీరు కార్యాలయంలో వ్యతిరేకతను ఎదుర్కోవచ్చు. ప్రత్యర్థులు మీ వ్యాపారాన్ని, ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు.
కుంభం
ఈ రోజు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు పురోగతికి అనేక అవకాశాలు పొందుతారు. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించవచ్చు.
Also Read: పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!
మీనం
ఈ రోజు కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రమాదకర పనులు చేయకండి. పనిపై శ్రద్ధ పెరుగుతుంది. మీ సన్నిహితుల కారణంగా సంతోషంగా ఉంటారు. సీరియస సభలో సీరియస్ విషయాలు చర్చించుకోవచ్చు.