(Source: ECI/ABP News/ABP Majha)
Spirituality: దానం-ధర్మం ఈ రెండిటికీ ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది!
దానం ధర్మం అనేమాట రెగ్యులర్ గా వింటుంటాం. కానీ రెండింటి మధ్యాచాలా వ్యత్యాసం ఉంది. దానం చేస్తే ఓ ఫలితం, ధర్మం చేస్తో మరోఫలితం లభిస్తుందంటారు పండితులు. ఇంతకీ దానం ఎవరికి చేయాలి, ధర్మం ఎవరికి చేయాలి...
మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయం కానీ, వస్తు సహాయం కానీ ధర్మం అంటారు. ఇలా 'ధర్మం' చేయడం వల్ల వచ్చినపుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది.మంత్రపూర్వకంగా ఓసద్బ్రాహ్మణునుడికి చేసేది 'దానం'. దానం చేయడం వల్ల ఉత్తమ జన్మ లభిస్తుందని చెబుతారు. ధర్మం చేయడానికి పరిధులు లేవుకానీ దానం చేయడానికి పరిధులుంటాయి.ఏదిపడితే అది దానం చేయడానికి వీలులేదు. శాస్త్రనియమానుసారం దాన యోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటిని మాత్రమే దానం చేయాలి. వాటినే చతుర్విద దానాలు, దశ దానాలు, షోడస దానాలు అని పిలుస్తారు.
చతుర్విద దానాలు
చతుర్విద దానాలు చేసిన వారికి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖంగా ఉంటారు
1. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం
2. వివిధ వ్యాధులతో నరక యాతన పడే రోగులకు వైద్యం చేయడం, చేయించడం
3. పేదవారికి ఉచిత విద్యను అందించడం
4. ఆకలితో అలమటించేవారికి అన్నదానం చేయడం
Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!
దశ దానాలు
దశదానాలంటే పది రకాలైన దానాలు. వీటిని మంత్రపూర్వకంగా దానం చేస్తేనే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందంటే..
గోదానం
బాగా పాలిచ్చే ఆవు, దూడతో కలసి ఉన్నది అయిన గోవును దానం ఇవ్వాలి. బాగా కలిగిన వారు బంగారం, వెండి, కంచు, రాగి ,నూతన వస్త్రాలతో అలంకరించి దానం ఇవ్వాలి. ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను, గోవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని సమర్పించుకోవాలి. ఇలాచేస్తే ఆ దాతకు పాపాలు నశించి స్వర్గలోక ప్రాప్తి ఉంటుందంటారు పండితులు
భూదానం
కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే.. శ్రీహరి వరాహావతారం ధరించి, ఆ భూమిని తన దంతాలతో నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది. ఈ దానంతో శివలోకప్రాప్తి కలుగుతుంది.
తిలదానం
తిలలు అంటే నువ్వులు.శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి. ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంతుష్టుడై విష్ణులోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
హిరణ్య (బంగారం) దానం
హిరణ్యం అంటే బంగారం. బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల, దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు.
Also Read: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి
ఆజ్య(నెయ్యి) దానం
ఆజ్యము అంటే ఆవు నెయ్యి. ఈ నెయ్యి కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. ఈ నెయ్యినే యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అలాంటి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.
వస్త్రదానం
చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించేది, మానాన్ని కాపాడేది వస్త్రం. అలాంటి వస్త్రాలు దానం చేయడం వల్ల సకల దేవతలు సంతోషించి, సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు.
ధాన్యదానం
ఆకలిని తీర్చేది ధాన్యం.అలాంటి ధాన్యాన్ని దానం చేయుట వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు సకల సుఖాలు కల్పిస్తారు.
గుడ(బెల్లం)దానం
రుచుల్లో మధురమైనది బెల్లం. ఈ బెల్లం చెరుకురసం నుంచి పుట్టింది. ఈ బెల్లం అంటే వినాయకుడికి, శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతృష్టులై అఖండ విజయాన్ని అందిస్తారు
రజత(వెండి)దానం
అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది వెండి. ఈ దానంతో శివ, కేశవులు, పితృదేవతలు సంతోషించి సర్వ సంపదలను, వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు.
లవణ(ఉప్పు)దానం
రుచులలో ఉత్తమమైనది ఉప్పు. ఈ దానంతో మృత్యుదేవత సంతోషించి..దాతకు ఆయుష్షు,బలం, ఆనందాన్నిస్తాడు
ఈ దశ దానాలను గ్రహణ సమయాల్లో, పర్వదినాల్లో, సంక్రమణాల్లో చేస్తే దాని ఫలితం పదింతలు అవుతుంది. ఈ దానాన్ని భక్తి శ్రద్ధలతో చేయాలి కానీ గ్రహీతకు ఏదో ఉపకారం చేస్తున్నట్టు చేయరాదు..